ఈ రోజు కూడా క్షిపణులను ప్రయోగించిన ఉత్తర కొరియా.. జపాన్, దక్షిణ కొరియా ఆగ్రహం
- నిన్న 20కి పైగా క్షిపణులను ప్రయోగించిన ఉత్తర కొరియా
- జపాన్ మీదుగా లాంగ్ రేంజ్ మిస్సైల్ ప్రయోగం
- మూల్యం చెల్లించుకుంటారని హెచ్చరించిన దక్షిణ కొరియా
జపాన్ మీదుగా లాంగ్ రేంజ్ క్షిపణిని ప్రయోగించిన తర్వాత... 8.39 గంటల సమయంలో రెండు షార్ట్ రేంజ్ క్షిపణులను ప్రయోగించింది. మరోపక్క, ఉత్తరకొరియా క్షిపణి ప్రయోగంపై దక్షిణకొరియా ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనికి ఉత్తర కొరియా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని వార్నింగ్ ఇచ్చింది.
ఇంకోవైపు నిన్న ఉత్తరకొరియా 20కి పైగా మిస్సైళ్లను ప్రయోగించింది. ఇందులో ఒక మిస్సైల్ దక్షిణకొరియా సముద్రజలాల్లో పడింది. ఇదిలావుంచితే, ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోవడానికి దక్షిణ కొరియా సన్నద్ధంగా ఉంది. దక్షిణ కొరియాకు అమెరికా అండగా ఉంది.