Dagnerous plant: విషపూరితమైన మొక్కను తెచ్చి ఇంట్లో పెంచుకుంటున్న వ్యక్తి.. కారణమేమిటంటే..!

  • ఈ మొక్క ముళ్లను తాకితే యాసిడ్ గాయమే
  • వారాల తరబడి నొప్పి బాధిస్తూనే ఉంటుందట
  • దీని చుట్టుపక్కల ఉంటే ఆత్మహత్య ఆలోచనలు పెరుగుతాయంటున్న సైంటిస్టులు
Man Grows Worlds Most Dangerous Plant At Home Out Of Boredom

ఇంట్లో బోర్ కొడుతుంటే టీవీ చూడడమో, సంగీతం వినడమో చేస్తుంటాం.. అయినా సెల్ ఫోన్లు అందుబాటులోకి వచ్చాక బోర్ కొడుతోందనే మాటే వినిపించట్లేదు. బ్రిటన్ కు చెందిన ఓ టీచర్ మాత్రం తన బోర్ డమ్ ను పోగొట్టుకోవడానికి ప్రమాదకరమైన మార్గాన్ని ఎంచుకున్నాడు. ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన మొక్కను తెచ్చి ఇంట్లోనే పెంచుతున్నాడు. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా తన ప్రాణం పోవచ్చని తెలిసి మరీ ఆస్ట్రేలియా నుంచి విత్తనాలు తెప్పించుకుని ఈ మొక్కను పెంచుతున్నాడు. 

జింపీ జీంపీ గా పిలిచే ఈ మొక్క ఎంత ప్రమాదకరమైందంటే.. యాసిడ్ ఒంటి మీద పడినపుడు కరెంట్ షాక్ కూడా తగిలితే ఎంత నొప్పి పుడుతుందో ఈ మొక్క ముళ్లు గుచ్చుకున్నా అంతే నొప్పి కలుగుతుందట. అంతేకాదు.. ఆ నొప్పి ఒకటీ రెండు క్షణాల్లో తగ్గిపోదని, రోజులు, వారాలపాటు ఉంటుందని గతంలో దీని బారిన పడ్డవాళ్లు చెప్పారు. కొన్ని సందర్భాల్లో నెలల తరబడి నొప్పి తగ్గకుండా ఉందని వివరించారు. ఈ మొక్క ఉన్నచోట తరచుగా గడిపితే ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలు కూడా వస్తాయని కొన్ని పరిశోధనలలో వెల్లడైంది. 

బ్రిటన్ కు చెందిన ఆన్ లైన్ ట్యూటర్ డేనియల్ ఎమ్లిన్ జోన్స్ తన ఇంట్లో ఈ ప్రమాదకరమైన మొక్కను పెంచుతున్నాడు. ఇందుకోసం తన ఇంట్లో ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసినట్లు తెలిపాడు. ఓ పంజరాన్ని తయారు చేయించి, దానికి డేంజర్ బోర్డు తగిలించి జాగ్రత్తగా చూసుకుంటున్నట్లు తెలిపాడు. ఆస్ట్రేలియన్ స్టింగింగ్ ట్రీ అని కూడా వ్యవహరించే ఈ మొక్క గురించి వివరాలన్నీ తెలుసుకున్నాకే ఆస్ట్రేలియా నుంచి విత్తనాలు తెప్పించుకున్నట్లు వివరించాడు.

More Telugu News