Naveen Chandra: ఆమె కోసం ఆ సినిమాను 38 సార్లు చూశాను: నవీన్ చంద్ర  

  • ఈ నెల 4వ తేదీన రిలీజ్ అవుతున్న 'తగ్గేదే లే'
  • నవీన్ చంద్ర సరసన ఇద్దరు నాయికలు 
  • కొంతసేపటి క్రితం జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్
  • అడుగడుగునా ట్విస్టులు ఉంటాయని చెప్పిన టీమ్  
Thaggedele pre release event

'దండుపాళ్యం' సినిమాకి ఒక ప్రత్యేకత ఉంది. క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో సాగే ఈ సినిమా ఒక వర్గం ప్రేక్షకుల ఆదరణ పొందింది. అప్పటి నుంచి ఈ సిరీస్ లో రకరకాల క్రైమ్ కథలు ప్రేక్షకులను పలకరిస్తూ వస్తున్నాయి. అలా ఆ సిరీస్ లో 'తగ్గేదే లే' అనే టైటిల్ తో మరో సినిమా థియేటర్లకు రావడానికి రెడీ అవుతోంది. భద్ర ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మితమైన ఈ సినిమాలో నవీన్ చంద్ర కథానాయకుడిగా నటించగా, ఆయన సరసన నాయికలుగా దివ్య పిళ్లై - అనన్య కనిపించనున్నారు. 

శ్రీనివాసరాజు దర్శకత్వం వహించిన ఈ సినిమా, ఈ నెల 4వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాదు 'దసపల్లా కన్వెన్షన్' లో నిర్వహించారు. హీరో హీరోయిన్స్ తో పాటు ఈ సినిమాలో కీలకమైన పాత్రలను పోషించిన మకరంద్ దేశ్ పాండే ..  రవి కాలే .. పూజా గాంధీ కూడా హాజరయ్యారు. ఈ సినిమాలో తమ పాత్రల ప్రాధాన్యతను గురించి చెప్పారు. ప్రతి ఐదు నిమిషాలకి ఒక ట్విస్ట్ ఉండటం ఈ సినిమా ప్రత్యేకత అని చెప్పారు.

నవీన్ చంద్ర మాట్లాడుతూ .. " ఈ సినిమా షూటింగు ఫస్టు లాక్ డౌన్ .. సెకండ్ లాక్ డౌన్ సమయంలో జరిగింది. ఆ సమయంలో టీమ్ లో ఎవరికీ కూడా పనిలేదు. అయినా ఈ సినిమా నిర్మాతలు రెండు షెడ్యూల్స్ కు సంబంధించిన పేమెంటును ముందుగానే ఇచ్చారు. ఇది వాళ్ల మంచి మనసుకు నిదర్శనం. ఒక వైపున దండుపాళ్యం గ్యాంగ్ .. మరో వైపున లవ్ స్టోరీ నడవడం ఈ సినిమాపై ఆసక్తిని రేకెత్తించే ప్రధానమైన అంశం. ఈ సినిమాలో కీలకమైన రోల్ చేసిన 'పూజా గాంధీ గారికి నేను వీరాభిమానిని. ఆమె హీరోయిన్ గా కన్నడలో చేసిన 'ముంగారు మలే' సినిమాను 38 సార్లు చూశాను. అలాంటి ఆర్టిస్ట్ తో కలిసి నటించడం నా అదృష్టంగా భావిస్తున్నాను" అంటూ చెప్పుకొచ్చాడు. 

More Telugu News