Munugode: పలివెల ఘర్షణపై ఈసీకి ఫిర్యాదు చేసిన టీఆర్ఎస్

  • మునుగోడు మండలం పలివెలలో టీఆర్ఎస్, బీజేపీల మధ్య ఘర్షణ
  • టీఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, జడ్పీ చైర్మన్లకు గాయాలు
  • ఈటల పీఆర్వో కాలికి కూడా గాయమైన వైనం
  • ఘర్షణకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని టీఆర్ఎస్ ఫిర్యాదు
trs complaint to ec over palivela incident

మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా చివరి రోజైన మంగళవారం టీఆర్ఎస్, బీజేపీ శ్రేణుల మధ్య ఘర్షణ చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. మునుగోడు మండలం పలివెలలో చోటుచేసుకున్న ఈ ఘటనపై కేంద్ర ఎన్నికల సంఘానికి టీఆర్ఎస్ ఫిర్యాదు చేసింది. ఘర్షణకు కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆ పార్టీ ఎన్నికల సంఘాన్ని కోరింది. 

పలివెల వచ్చిన బీజేపీ నేత, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కాన్వాయ్ పై టీఆర్ఎస్ శ్రేణులే ముందుగా దాడి చేశాయంటూ కథనాలు వినిపించాయి. అయితే ఈ దాడిలో టీఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి, నల్లగొండ జిల్లా పరిషత్ చైర్మన్ జగదీశ్ లకు గాయాలయ్యాయి. ఆ తర్వాత టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి కూడా గాయపడ్డట్లు ఫొటోలు విడుదలయ్యాయి. ఇక టీఆర్ఎస్ దాడిలో ఈటల రాజేందర్ పీఆర్వో కాలికి కూడా గాయమైంది.

More Telugu News