Telangana: ముగిసిన మునుగోడు ప్రచార హోరు... ఎల్లుండే పోలింగ్

  • మంగళవారం సాయంత్రం 6 గంటలతో ముగిసిన ఎన్నికల ప్రచారం
  • గురువారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల దాకా పోలింగ్
  • బరిలో నిలిచిన 47 మంది అభ్యర్థులు
  • ఈ నెల 6న వెల్లడి కానున్న ఉప ఎన్నిక ఫలితం
munugode bypoll campaign concludes

తెలంగాణలో అమితాసక్తి రేకెత్తిస్తున్న మునుగోడు శాసన సభ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో మంగళవారం సాయంత్రం 6 గంటలకు ఓ కీలక ఘట్టం ముగిసింది. మునుగోడు ఉప ఎన్నికల ప్రచారం మంగళవారం సాయంత్రం 6 గంటలకు ముగిసింది. సరిగ్గా 6 గంటలు కాగానే... మునుగోడు ఎన్నికల ప్రచారం ముగిసినట్లుగా కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటన చేసింది. ఇక నియోకజవర్గ వ్యాప్తంగా ఏ ఒక్క ప్రాంతంలోనూ ఏ పార్టీకి చెందిన ప్రచారాన్ని కూడా అనుమతించరు. మంగళవారం సాయంత్రం దాకా మునుగోడు వ్యాప్తంగా ప్రచారం హోరెత్తగా... కాసేపటి క్రితం అన్ని పార్టీల గళాలు మూగబోయాయి.


ఇక మునుగోడు ఉప ఎన్నికల్లో అత్యంత కీలక ఘట్టమైన పోలింగ్ ఈ నెల 3న (గురువారం) ఉదయం 7 గంటలకు మొదలు కానుంది. గురువారం ఉదయం నుంచి సాయంత్రం 6 గంటల దాకా కొనసాగనున్న పోలింగ్ కు ఇప్పటికే ఎన్నికల సంఘం పూర్తి ఏర్పాట్లు చేసింది. ఉప ఎన్నికల బరిలో 3 ప్రధాన పార్టీల అభ్యర్థులతో కలిపి మొత్తం 47 మంది బరిలో నిలిచిన సంగతి తెలిసిందే. వీరి భవితవ్యాన్ని మునుగోడు ఓటర్లు గురువారం బ్యాలెట్ బాక్సుల్లో నిక్షిప్తం చేయనున్నారు. ఆ తర్వాత ఈ నెల 6న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.

More Telugu News