Telangana: రోడ్డు ప్రమాద బాధితులను తన కారులో ఆసుపత్రికి తరలించిన కేటీఆర్

ktr stops on on road and gives lift to road accident couple in his convoy
  • మునుగోడు ఎన్నికల ప్రచారానికి హాజరైన కేటీఆర్
  • తిరుగు ప్రయాణంలో రోడ్డు ప్రమాద బాధితులకు పరామర్శ
  • తన కాన్వాయ్ లోని ఓ కారులో వారిని హైదరాబాద్ తరలించిన మంత్రి
టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ మంత్రి కేటీఆర్ మంగళవారం మానవత్వాన్ని చాటుకున్నారు. మునుగోడు ఎన్నికల ప్రచారానికి హాజరై తిరిగి హైదరాబాద్ వెళుతున్న సందర్భంగా రోడ్డు ప్రమాదానికి గురైన దంపతులను చూసిన కేటీఆర్ తన కాన్వాయ్ ను ఆపారు. కారు దిగి రోడ్డు ప్రమాద బాధిత దంపతులను ఆయన పరామర్శించారు. అనంతరం వారిని తన కాన్వాయ్ లోని ఓ కారులో వారిని ఎక్కించుకుని హైదరాబాద్ లోని ఆసుపత్రికి తరలించారు.

మునుగోడు ఉప ఎన్నికల ప్రచారానికి చివరి రోజైన మంగళవారం మునుగోడు పరిధిలోని పలు గ్రామాల్లో కేటీఆర్ రోడ్డు షో నిర్వహించారు. టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి ఓటు వేయాలని అభ్యర్థించారు. ఎన్నికల ప్రచారం ముగిసే సమయానికి కాస్తంత ముందుగానే ఆయన తన ప్రచారాన్ని ముగించారు. అనంతరం తిరిగి హైదరాబాద్ వెళుతున్న సమయంలో ఆయన రోడ్డు ప్రమాద బాధితులను తన కాన్వాయ్ లో ఆసుపత్రికి తరలించారు.
Telangana
TRS
KTR
Munugode
Road Accident
Hyderabad

More Telugu News