Sirish: 'ఏంటి బాబూ .. మాట్లాడితే ముంబై వెళ్లొస్తున్నావ్?' : శిరీష్ ను ఆటపట్టించిన అలీ

Allu Sirish Interview
షార్ట్స్‌లో చూడండి
అల్లు శిరీష్ హీరోగా 'ఊర్వశివో రాక్షసివో' సినిమా రూపొందింది. గీతా ఆర్ట్స్ 2 వారు సమర్పిస్తున్న ఈ సినిమాలో, కథానాయికగా అనూ ఇమ్మాన్యుయేల్ అలరించనుంది. ఈ నెల 4వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ జోరుగా జరుగుతున్నాయి. తాజాగా 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో అల్లు శిరీష్ పాల్గొన్నాడు. అందుకు సంబంధించిన 'ప్రోమో' ఇప్పుడు రన్ అవుతోంది. 

"ఏంటి ఈ మధ్య ముంబైకి చాలా ఎక్కువగా ట్రావెల్ చేస్తున్నావ్ .. కోడలిని తీసుకొచ్చే ప్రాసెస్ లో ఉన్నావా?" అంటూ అలీ అడగడంతో శిరీష్ నవ్వేశాడు. ఈ సినిమాలో శిరీష్ - అనూ మధ్య లిఫ్టులో లిప్ కిస్ సీన్ ఒకటి ఉంది. ట్రైలర్ లో దానినినే ఎక్కువగా హైలైట్ చేశారు. అందుకు సంబంధించి ఎక్కడి లిఫ్టును వాడారు? ఎన్ని టేకులు తీసుకున్నావు" అంటూ అలీ ఆటపట్టించాడు. ఆ సీన్ చూసి అందరూ తనని ఏడిపిస్తున్నారని శిరీష్ అన్నాడు. 

"బన్నీ తన వైఫ్ కి చెప్పకూడని సీక్రెట్స్ కూడా నిన్ను పిలిచి నీకు చెబుతాడట ఏంటి?" అంటూ అలీ అడిగాడు. అలాగే మీ ముగ్గురు అన్నదమ్ములలో కోపిష్టి ఎవరు? అని అడిగాడు. ఈ రెండూ కూడా ఆసక్తిని రేకెత్తించే ప్రశ్నలే. అందుకు శిరీష్ ఏమని చెప్పాడనేది పూర్తి ఎపిసోడ్ చూస్తేనే గాని తెలియదు. పూర్తి ఎపిసోడ్ వచ్చేవారం ప్రసారం కానుంది.
Go Back to Shorts
Sirish
Anu Emmanuel
Ali
Alitho Saradaga

More Telugu News