Andhra Pradesh: ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పేరు మార్పునకు గవర్నర్ ఆమోద ముద్ర

ap governor approves ntr health versity name change bill
  • ఇటీవలి అసెంబ్లీ సమావేశాల్లో ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పేరు మార్పిడికి ఆమోదం
  • అసెంబ్లీ తీర్మానానికి ఆమోద ముద్ర వేసిన గవర్నర్
  • ఆ వెంటనే గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం
  • ఫలితంగా సోమవారం నుంచే వైఎస్సార్ హెల్త్ వర్సిటిగా మారిన పేరు
ఏపీలోని డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ పేరును మారుస్తూ వైసీపీ సర్కారు చేసిన తీర్మానానికి సోమవారం రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోద ముద్ర వేశారు. ఇటీవలి అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పేరును డాక్టర్ వైఎస్సార్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ గా మారుస్తూ అధికార వైసీపీ తీర్మానం ప్రవేశపెట్టగా..ఆ పార్టీకి సభలో ఉన్న బలం ఆధారంగా సభ ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే.

ఈ మేరకు ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ సవరణ చట్టానికి ఆమోదం తెలపాలంటూ గవర్నర్ కు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపింది. ఈ వ్యవహారంపై పరిశీలన చేసిన గవర్నర్... సోమవారం ఆ ప్రతిపాదనకు ఆమోద ముద్ర వేశారు. గవర్నర్ ఆమెదం లభించడంతో ఈ బిల్లును చట్టంగా మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఫలితంగా సోమవారం నుంచి ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పేరు అధికారికంగా వైఎస్సార్ హెల్త్ వర్సిటీగా మారిపోయింది.
Andhra Pradesh
YSRCP
AP Assembly
AP Governor
Biswabhusan Harichandan
NTR Health Versity
YSR Health Versity

More Telugu News