ఇప్పటంలో నాదెండ్ల మనోహర్... సెల్ ఫోన్ టార్చ్ వెలుతురులోనే మాట్లాడిన జనసేన నేత
- జనసేన ఆవిర్భావ సభకు భూమిని ఇచ్చిన ఇప్పటం గ్రామస్థులు
- అందుకు ప్రతిగా గ్రామానికి రూ.50 లక్షల విరాళం ప్రకటించిన పవన్
- ఆ నిధులను సీఆర్డీఏ ఖాతాలో జమ చేయాలని అధికారులు చెప్పడమేమిటని నాదెండ్ల ప్రశ్న
- ఆ నిధులతో కట్టే కమ్యూనిటీ హాల్ కు వైఎస్సార్ పేరు పెడతామనడంపై ఆగ్రహం
ఈ సందర్భంగా ఇప్పటం గ్రామానికి జనసేనాని పవన్ కల్యాణ్ ప్రకటించిన రూ.50 లక్షల విరాళంపై అధికారులు జారీ చేసిన ఆదేశాలపై నాదెండ్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. జనసేన సభ కోసం ఇప్పటం గ్రామస్థులు తమ భూమిని ఇస్తే... దానికి ప్రతిగా గ్రామానికి పవన్ రూ.50 లక్షల విరాళం ఇచ్చారని ఆయన గుర్తు చేశారు. ఈ నిధులను సీఆర్డీఏ ఖాతాలో జమ చేయమని అధికారులు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. అంతేకాకుండా పవన్ నిధులతో గ్రామంలో ఓ కమ్యూనిటీ హాల్ ను నిర్మించి దానికి వైఎస్సార్ పేరు పెడతామని అధికారులు చెప్పడం మరింత విడ్డూరంగా ఉందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.