Australia: సత్తా చాటిన బౌలర్లు... ఐర్లాండ్ పై ఆస్ట్రేలియా ఈజీ విక్టరీ

  • టీ20 వరల్డ్ కప్ లో నేడు ఆసీస్ వర్సెస్ ఐర్లాండ్
  • బ్రిస్బేన్ లో జరిగిన మ్యాచ్
  • 20 ఓవర్లలో 5 వికెట్లకు 179 రన్స్ చేసిన ఆసీస్
  • 18.1 ఓవర్లలో 137 పరుగులకు ఐర్లాండ్ ఆలౌట్
  • 71 పరుగులతో ఐరిష్ వికెట్ కీపర్ ఒంటరిపోరు
Aussies downs Ireland in T20 World Cup

ఐర్లాండ్ తో జరిగిన వరల్డ్ కప్ మ్యాచ్ లో ఆతిథ్య ఆస్ట్రేలియా 42 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. తొలుత 20 ఓవర్లలో 5 వికెట్లకు 179 పరుగులు చేసిన ఆసీస్ జట్టు... ఆపై ఐర్లాండ్ ను 18.1 ఓవర్లలో 137 పరుగులకే ఆలౌట్ చేసింది. ప్యాట్ కమిన్స్, మ్యాక్స్ వెల్, మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా రెండేసి వికెట్లు సాధించగా, స్టొయినిస్ 1 వికెట్ తీశాడు. 

ఐర్లాండ్ ఇన్నింగ్స్ లో వికెట్ కీపర్ లొర్కాన్ టకర్ ఒంటరిపోరాటం చేశాడు. టకర్ 48 బంతుల్లోనే 71 పరుగులు చేశాడు. టకర్ చివరి వరకు క్రీజులో ఉన్నప్పటికీ అతడికి ఇతర బ్యాట్స్ మెన్ నుంచి సహకారం కరవైంది. 

కాగా, ఈ విజయంతో ఆస్ట్రేలియా సూపర్-12 గ్రూప్-1 పాయింట్ల పట్టికలో రెండోస్థానానికి ఎగబాకింది. ఆసీస్ ఇప్పటిదాకా 4 మ్యాచ్ లు ఆడి రెండు విజయాలు నమోదు చేసింది.

More Telugu News