Surya: 'బిగ్ బాస్ 6'లో టాప్ ఫైవ్ లో ఎవరుంటారనేది చెప్పిన సూర్య!

  • బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికి వచ్చేసిన సూర్య
  • తాను పెద్దగా బాధపడటం లేదని వెల్లడి 
  • చంటి ఎలిమినేషన్ జన్యూన్ గా అనిపించలేదని వ్యాఖ్య
  • రేవంత్ లో అదొక్కటే మైనస్ అంటూ వివరణ  
Bigg Boss 6  Update

'బిగ్ బాస్ సీజన్ 6'లో అనూహ్యమైన పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ వారం ఫలానావారు ఎలిమినేట్ కావొచ్చనుకుంటే, అందుకు భిన్నంగా మరెవరో బయటికి వచ్చేస్తున్నారు. 55వ రోజున గీతూను .. ఫైమాను సున్నితంగా హెచ్చరించిన నాగ్, తన చేతికి వచ్చిన స్క్రోల్ ను చూపిస్తూ సూర్య ఎలిమినేట్ అయినట్టుగా ప్రకటించారు. దాంతో అటు హౌస్ లోని వాళ్లు .. ఇటు టీవీల ముందు కూర్చున్నవారు కూడా షాక్ అయ్యారు. ఎందుకంటే అంతకంటే వీక్ కంటెస్టెంటులు హవుస్ లో ఇద్దరు ముగ్గురు ఉన్నారు. 

బిగ్ బాస్ హౌస్ లో నుంచి బయటికి వచ్చిన సూర్య తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ .. "నా ఎలిమినేషన్ జరిగినప్పుడు నేనేం షాక్ కాలేదు. ఎందుకంటే 7వ వారం తరువాత నుంచి ఎప్పుడైనా సరే నేను బయటికి వెళ్లొచ్చు అనే ఉద్దేశంతో అందుకు సిద్ధపడే ఉంటూ వచ్చాను. నా నుంచి ది బెస్ట్ ఇచ్చాను ... బెస్టుగానే బయటికి వచ్చానని నా ఫీలింగ్. బిగ్ బాస్ హౌస్ లో ఉండాలనుకుంటే లవ్ ట్రాక్ నడపాలి. లేదంటే బయటికి వచ్చేస్తారు అనే మాటలో నిజం లేదు. ఎవరి పరిమితులు వారికి తెలుసు .. ఎంత క్లోజ్ గా ఉన్నప్పటికీ ఒకరినొకరు నామినేట్ చేయవలసిన సందర్భాలు వస్తూనే ఉంటాయి" అని అన్నాడు. 

"నా కంటే ముందుగా బయటికి వచ్చేసినవారిలో చంటి ఎలిమినేషన్ జన్యూన్ కాదని నాకు అనిపించింది. ఆయన ఎందుకు ఎలిమినేట్ అయ్యాడనే విషయం ఇప్పటికీ నాకు అర్థం కాలేదు. రేవంత్ విషయానికి వస్తే .. ఎప్పుడైనా ఓడిపోతే కాస్త ఉడుకుబోతు తనం చూపిస్తూ ఉంటాడు. అది ఒక్కటి కరెక్ట్ చేసుకుంటే, ఆయనని విన్నర్ గా చూసే అవకాశం ఉంది. నాకు తెలిసి రేవంత్ ... శ్రీహాన్ .. గీతూ .. ఫైమా .. ఆదిరెడ్డి టాప్ ఫైవ్ లో ఉండొచ్చని అనుకుంటున్నాను" అంటూ చెప్పుకొచ్చాడు.

More Telugu News