Hansika Motwani: బోయ్ ఫ్రెండ్ తో పెళ్లి పీటలపైకి హన్సిక మోత్వానీ?

Hansika Motwani mystery man revealed to tie the knot on December 4
  • డిసెంబర్ 4న పెళ్లి
  • వెలుగులోకి సమాచారం
  • వేదిక రాజస్థాన్ లోని జైపూర్
  • అధికారికంగా రాని ప్రకటన
కథానాయిక హన్సిక మోత్వానీ త్వరలోనే పెళ్లికూతురు కానుంది. డిసెంబర్ 4న జైపూర్ లో ఆమె బోయ్ ఫ్రెండ్ ను పెళ్లాడనున్నట్టు హిందుస్థాన్ టైమ్స్ పోర్టల్ రిపోర్ట్ చేసింది. పెళ్లి కార్యక్రమాలు డిసెంబర్ 2న మొదలవుతాయని, అదే రోజు సుఫీ నైట్, తర్వాతి రోజు మెహెందీ, సంగీత్ కార్యక్రమాలు ఉంటాయని పేర్కొంది. 

కేవలం కుటుంబ సభ్యులు, సన్నిహితులు, మిత్రులనే ఈ పెళ్లికి ఆహ్వానిస్తున్నట్టు వెల్లడించింది. కాకపోతే బోయ్ ఫ్రెండ్ ఎవరన్నది పేర్కొనలేదు. అయినప్పటికీ, సోహాల్ కతూరియా అనే ముంబై వ్యాపారిని ఆమె పెళ్లాడనున్నట్టు ప్రచారం జరుగుతోంది. సోహాల్, హన్సిక చాలా కాలంగా స్నేహితులు. వీరు కొంత కాలం డేటింగ్ లో కూడా ఉన్నారు. ఓ కంపెనీలో వీరు భాగస్వాములుగానూ ఉన్నారు.
Hansika Motwani
marriage
december 4
boy friend

More Telugu News