solar halo: సూర్యుడిని ఇలా ఎప్పుడూ చూసి ఉండరు.. వీడియో ఇదిగో

Beautiful sun halo shows over a mountain in Sweden Video will leave you stunned
  • సోలార్ హాలో కారణంగా భిన్నంగా కనిపించిన సూర్యుడు
  • మంచు వాతావరణం కారణంగా ఇలాంటి ఘటనలు
  • స్వీడన్ లోని పర్వతంపై కనిపించిన దృశ్యం
సృష్టి అంటేనే ఓ పెద్ద మిస్టరీ. నవ గ్రహాల్లో మండే అగ్నిగోళం సూర్యుడు చాలా ప్రత్యేకం. సూర్యోదయం, సూర్యాస్తమయం సందర్భాల్లోనే ఆయన్ను కళ్లతో చూడగలం. అటువంటి సూర్యుడు చాలా కొత్తగా కనిపిస్తే..? సూర్యుడి వలయం చుట్టూ కాంతి రేఖలు భిన్నంగా కనిపిస్తే? చూడడానికి ఎంతో ప్రత్యేకంగా ఉంటుంది. 

స్వీడన్ లో ఇలాంటి సోలార్ హాలో (కాంతిమండలం) దృశ్యమే కనిపించింది. దాన్ని నెటిజన్లు వీడియో తీసి ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. మంచుతో కప్పేసిన ఓ పర్వతంపై నుంచి సూర్యుడిని వీడియో తీశారు. సూర్యుడికి, మనకు మధ్య వాతావరణంలో మంచు అధికంగా ఉన్నప్పుడు ఈ రకమైన హాలో కనిపిస్తుంది.
solar halo
sun halo
Sweden
Video
trending

More Telugu News