Nithya Menen: నిత్యా మీనన్ తల్లి అవుతోందా?.. అసలు విషయం ఇదీ!

Parvathy Nithya Menen share pregnancy test results on social media leaves everyone confused
  • ప్రెగ్నెన్సీ కిట్ లో పాజిటివ్ ఫలితం ఉన్న ఫొటో షేర్
  • అద్భుతం మొదలైందంటూ క్యాప్షన్
  • దీంతో అభిమానుల్లో గుబులు
  • మలయాళ నటి పార్వతి సైతం ఇదే విధమైన పోస్ట్
  • సినిమా ప్రచారంలో భాగమే ఇదంతా! 
నిత్య మీనన్ సామాజిక మాధ్యమంలో అభిమానులకు షాక్ ఇచ్చారు. గర్భం దాల్చినట్టు ఫలితం వచ్చిన ప్రెగ్నెన్సీ పరీక్షా కిట్ ను ఫొటో తీసి ఇన్ స్టాగ్రామ్ లో ఉంచారు. దీన్ని చూసిన అభిమానులు కంగుతిన్నారు. ‘ఎవరికీ చెప్పకుండా ఎప్పుడు పెళ్లి చేసుకున్నావు నిత్యా..?’ అంటూ ప్రశ్నలు కురిపించారు. 

ప్రెగ్నెన్సీ కిట్ లో పాజిటివ్ ఫలితాన్ని చూపిస్తున్న ఫొటో పోస్ట్ చేసిన నిత్య.. అద్భుతం మొదలైంది అంటూ క్యాప్షన్ పెట్టి మరింత ఆసక్తి కలిగించింది. పక్కనే లవ్ సింబల్ ఎమోజీ కూడా వేసింది. దీంతో పలువురు సెలబ్రిటీలు, అభిమానులు కంగ్రాట్స్ అంటూ అభినందనలు చెప్పేస్తున్నారు. సరిగ్గా మలయాళ నటి పార్వతి కూడా ఇదే ఫొటో, ఇదే క్యాప్షన్ ను తన ఇన్ స్టా గ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసింది. దీన్ని చూసిన గాయని చిన్మయి శ్రీపాద, నటి స్వరా భాస్కర్, నిర్మాత గునీత్ మోంగా అభినందనలు చెప్పారు.

ఇంతకీ విషయం ఏమిటంటే వీరు గర్భం దాల్చలేదు. సినిమా ప్రచారంలో భాగంగా ఇలా వినూత్నంగా ప్రయత్నించారు. సరిగ్గా ఇదే విధమైన ఫొటో, క్యాప్షన్ ను నటి పద్మప్రియ, సయనోరా ఫిలిప్ కూడా పోస్ట్ చేయడం గమనార్హం. పార్వతి, నిత్యా మీనన్ సంయుక్తంగా వండర్ వుమెన్ అనే సినిమాలో నటిస్తున్నారు. దానిపై హైప్ క్రియేట్ చేయడానికే ఈ మార్గాన్ని అనుసరించారు. ఏదైమైనా వీరి పోస్టులు కొందరిని అయోమయానికి గురి చేశాయి.
 
Nithya Menen
actor
Parvathy
pregnancy test kit
positive

More Telugu News