Redmi Note 12: 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ తో రెడ్ మీ నోట్ 12 సిరీస్ విడుదల

Redmi Note 12 series with up to 120W fast charging and 200MP main camera launched
  • చైనా మార్కెట్లో ఆవిష్కరించిన షావోమీ
  • రూ. 14-30 వేల మధ్య వీటి ధరలు 
  • త్వరలో భారత మార్కెట్లోకి
భారత వినియోగదారుల ముంగిటకు త్వరలోనే రెడ్ మీ నోట్ 12 సిరీస్ ఫోన్లు రానున్నాయి. షావోమీ వీటిని తాజాగా చైనా మార్కెట్లో విడుదల చేసింది. రెడ్ మీ 12, రెడ్ మీ 12 ప్రో, రెడ్ మీ 12 ప్రో ప్లస్ ఇలా మూడు రకాలు విడుదలైన వాటిల్లో ఉన్నాయి. వేరియంట్ ఆధారంగా చైనా మార్కెట్లో వీటి ధరలు రూ.13,600 నుంచి ప్రారంభమవుతున్నాయి. రెడ్ మీ నోట్ 12 ప్రో ప్లస్ హై ఎండ్ వేరియంట్ ధర రూ.30 వేలుగా ఉంది. భారత మార్కెట్లోకి ఎప్పుడు విడుదల చేసేదీ కంపెనీ ప్రకటించలేదు. సాధారణంగా చైనాలో విడుదలైన తర్వాత కొన్ని రోజులకు భారత మార్కెట్లోకి వస్తుంటాయి.

రెడ్ మీ 12 వేరియంట్ 6.67 అంగుళాల ఓఎల్ఈడీ డిస్ ప్లేతో వస్తుంది. 120 హెర్జ్ రీఫ్రెష్ రేటు, స్నాప్ డ్రాగన్ 4 జనరేషన్ 1 ఎస్ వోసీ తో పనిచేస్తుంది. 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ తో వస్తుంది. వెనుక భాగంలో 48 మెగాపిక్సల్, 2 మెగాపిక్సల్ కెమెరా సెటప్ ఉంది. ముందు భాగంలో సెల్ఫీల కోసం 8 మెగాపిక్సల్ కెమెరా ఉంటుంది.

రెడ్ మీ 12 ప్రోలో 6.67 అంగుళాల ఓఎల్ఈడీ డిస్ ప్లే, 120 హెర్జ్ రీఫ్రెష్ రేటు ఉన్నాయి. మీడియాటెక్ డైమెన్సిటీ 1080 చిప్ సెట్ తో పనిచేస్తుంది. 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ 67 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది. వెనుక భాగంలో మూడు కెమెరాలు.. 50 మెగాపిక్సల్, 8 మెగాపిక్సల్ అల్ట్రా వైడ్, 2 మెగాపిక్సల్ మ్యాక్రో కెమెరాలు ఉన్నాయి. ముందు భాగంలో 16 మెగాపిక్సల్ కెమెరా ఉంది. 

రెడ్ మీ 12 ప్రో ప్లస్ వేరియంట్ 6.67 అంగుళాల ఓఎల్ఈడీ డిస్ ప్లే, 120 హెర్జ్ రీఫ్రెష్ రేటుతో ఉంటుంది. ఇది కూడా మీడియాటెక్ డెమెన్సిటీ 1080 చిప్ సెట్ తోనే వస్తుంది. కాకపోతే 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ ఫీచర్ ఇందులో ఉంటుంది. వెనుక భాగంలో 200 మెగాపిక్సల్ ప్రైమరీ కెమెరా, 8 మెగాపిక్సల్ అల్ట్రావైడ్ యాంగిల్ కెమెరా, 2 మెగాపిక్సల్ మ్యాక్రో కెమెరా ఉన్నాయి. ముందు 16 మెగాపిక్సల్ కెమెరా ఏర్పాటు చేశారు.
Redmi Note 12
launched
china market
prices
features

More Telugu News