Nothing Ear Stick: నథింగ్ ఇయర్ స్టిక్ విడుదల.. ధర రూ.8,499

Nothing Ear Stick with 29 hours of battery life launched in India price set at Rs 8499
  • నవంబర్ 17 నుంచి అమ్మకాలు మొదలు
  • ఫ్లిప్ కార్ట్, మింత్రా పోర్టళ్లపై లభ్యం
  • లిప్ స్టిక్ మాదిరి కేస్.. 29 గంటల బ్యాటరీ బ్యాకప్
కొన్నినెలల పాటు ఊరించిన తర్వాత నథింగ్ కంపెనీ సరికొత్త ఇయర్ స్టిక్స్ (ఇయర్ బడ్స్)ను విడుదల చేసింది. వీటి ధర రూ. 8,499. నథింగ్ కంపెనీ నుంచి విడుదలైన రెండో ఇయర్ బడ్స్ ఇవి. ఇప్పటి వరకు మార్కెట్లో ఉన్న మరే ఇతర ఇయర్ బడ్స్ ను పోలని విధంగా వినూత్న డిజైన్ తో వచ్చాయి. 

29 గంటల పాటు పనిచేసే విధంగా బ్యాటరీ బ్యాకప్ ఇందులో ఉంది. అంటే ఇయర్ స్టిక్స్ మూడు గంటల పాటు మాట్లాడుకునేందుకు, 7 గంటల పాటు మ్యూజిక్ వినేందుకు సపోర్ట్ చేస్తాయి. బాక్స్ లో 22 గంటల బ్యాకప్ సరిపడా చార్జింగ్ ఉంటుంది. 12.6 ఎంఎం డ్రైవర్ తో మంచి సౌండ్ క్వాలిటీ అందుకోవచ్చు. ఒక్కో ఇయర్ స్టిక్ 4.4 గ్రాముల బరువుతో వస్తుంది. సిలికాన్ టిప్స్ వీటికి ఉండవు. అవి లేకుండానే డిజైన్ ఉండడాన్ని గమనించాలి. సిలికాన్ టిప్స్ ఉంటే ఎక్కువ సమయం పాటు ధరించినా ఇబ్బంది అనిపించదు. అలాగే, యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ లేదు. బాస్ లాక్ టెక్నాలజీతో వస్తుంది. టచ్ కంట్రోల్స్ తో పనిచేస్తుంది. 

ఇయర్ స్టిక్ కేస్ లిప్ స్టిక్ మాదిరి సైజు, డిజైన్ తో ఉండడం మరో ఆకర్షణగా చెప్పుకోవాలి. నవంబర్ 4 నుంచి వీటి విక్రయాలు మొదలవుతాయని, ప్రపంచవ్యాప్తంగా 40కు పైగా దేశాల్లో అందుబాటులో ఉంటాయని కంపెనీ ప్రకటించింది. భారత మార్కెట్లో మాత్రం ఫ్లిప్ కార్ట్, మింత్రా పోర్టళ్లపై నవంబర్ 17 నుంచి అమ్మకాలు ఉంటాయని తెలిపింది.
Nothing Ear Stick
launched
Rs 8499
sale
Flipkart
Myntra

More Telugu News