జగన్ తో రాంగోపాల్ వర్మ భేటీ... ఏపీ సీఎంతో కలిసి లంచ్ చేసిన దర్శకుడు
- తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన భేటీ
- 40 నిమిషాలకు పైగా జగన్, వర్మ మధ్య చర్చలు
- తాజా రాజకీయ పరిణామాలపై చర్చ జరిగినట్లు సమాచారం
- రాజకీయ నేపథ్యంలో తీయబోయే సినిమా గురించి జగన్ కు వర్మ వివరించినట్లు వార్తలు
సినిమా టికెట్ రేట్ల విషయంలో గతంలో ఏపీ ప్రభుత్వంతో జరిగిన చర్చల్లో భాగంగా ఓ సారి అప్పటి సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నానితో వర్మ భేటీ అయిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఏపీ ప్రభుత్వ ప్రతినిధులతో వర్మ భేటీ అయిన దాఖలాలే లేవు. తాజాగా ఉన్నట్టుండి వర్మ విజయవాడ రావడం, ఆ వెంటనే జగన్ తో భేటీ అయిన వైనంపై ఆసక్తికర చర్చ నడుస్తోంది. తాజా రాజకీయ పరిణామాలపై వారిద్దరి మధ్య చర్చ జరిగినట్లు సమాచారం. అంతేకాకుండా రాజకీయ నేపథ్యంలో తాను తీయబోయే సినిమా గురించి కూడా జగన్ కు వర్మ వివరించినట్టు తెలుస్తోంది.