Sridevi: భర్తతో ఆ అలవాటు మాన్పించేందుకు రిస్క్ చేసిన శ్రీదేవి

Sridevi risked her health to make Boney Kapoor quit smoking says Janhvi
  • పొగతాగడం మానే వరకు మాంసం ముట్టనంటూ ప్రతిన
  • కేవలం శాకాహారానికే పరిమితమైన శ్రీదేవి
  • చాలా బలహీనంగా మారినా వీడని పట్టుదల
  • వెల్లడించిన జాన్వీ కపూర్
ప్రముఖ నటి శ్రీదేవి తన భర్త, నిర్మాత బోనీ కపూర్ తో పొగతాగే అలవాటు మాన్పించేందుకు ఎంతగానో ప్రయత్నించింది. ఎంతకీ మానకపోవడంతో, చివరికి తన ఆరోగ్యాన్ని కూడా ఆమె లెక్క చేయకుండా రిస్క్ చేసింది. ఈ విషయాన్ని శ్రీదేవి పెద్ద కుమార్తె, బాలీవుడ్ యువ నటి జాన్వీ కపూర్ బయటపెట్టింది. ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో భాగంగా ఆమె తన చిన్న నాటి విషయాన్ని వెల్లడించింది.

బోనీ కపూర్ పొగతాగడాన్ని విడిచి పెట్టే వరకు తాను మాంసాహారం ముట్టనంటూ శ్రీదేవి కేవలం శాకాహారానికి పరిమితమైంది. కానీ, చాలా బలహీనంగా ఉన్నావంటూ, మరింత తినాలని, మాంసాహారాన్ని తీసుకోవాలని వైద్యులు సూచించారట. ఆ సమయంలో శ్రీదేవిని బోనీ కపూర్ వేడుకున్నారట. ‘‘నేను పొగతాడాన్ని ఆపేయాలని ఆమె కోరుకుంది. అప్పుడు నేను చేయలేదు. ఇప్పుడు చేస్తాను’’అని నాలుగైదేళ్ల క్రితం తండ్రి తనతో చెప్పినట్టు జాన్వీ వెల్లడించింది.
Sridevi
Boney Kapoor
quit smoking
Janhvi

More Telugu News