Unilever: డవ్.. ట్రెసెమే షాంపూలు వాడుతున్నారా..? డేంజర్..!

Dove other Unilever dry shampoos recalled over cancer risk
  • వీటిల్లో హానికారక బెంజీన్ కెమికల్ ఉన్నట్టు గుర్తింపు
  • దీంతో వెనక్కి తీసుకోవాలని నిర్ణయం
  • బెంజీన్ తో కేన్సర్ రిస్క్
ప్రముఖ కంపెనీల ఉత్పత్తులు కూడా ఆరోగ్యానికి సురక్షితం కాదంటూ వస్తున్న వార్తలు వినియోగదారులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. యూనిలీవర్ కంపెనీ ప్రపంచంలోనే దిగ్గజ ఎఫ్ఎంసీజీ సంస్థ. అయినా కానీ, కేన్సర్ రిస్క్ ఉందంటూ తాజాగా ఏరోసోల్ ఆధారిత డ్రై షాంపూలు అయిన.. డవ్, ట్రెసెమె ఉత్పత్తులను మార్కెట్ నుంచి వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించింది. ఈ ఉత్పత్తులు ప్రమాదకరమైన బెంజీన్ అనే కెమికల్ తో కలుషితమైనట్టు వెల్లడైంది.

బెంజీన్ కెమికల్ కేన్సర్ కు దారితీసే మహమ్మారి. దీంతో నెక్సస్, సావ్, ట్రెసెమే, టిగి, డవ్ లను వెనక్కి తీసుకోవాలని యూనిలీవర్ నిర్ణయించింది. అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ వెబ్ సైట్ లో ఈ మేరకు ఓ నోటీసు పోస్ట్ చేశారు. 2021 అక్టోబర్ ముందు తయారు చేసిన కొన్ని ఉత్పత్తులను ఉపసహరించుకుంటున్నట్టు యూనీలీవర్  ప్రకటించింది. దీంతో వ్యక్తిగత సంరక్షణలో యూనిలీవర్ ఉత్పత్తుల వాడకం ఎంత వరకు సురక్షితం అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

అసలు ఏరోసోల్ ఆధారిత ఉత్పత్తుల వాడకంతో రిస్క్ ఉందని తెలుస్తోంది. ఎందుకంటే జాన్సన్ అండ్ జాన్సన్ న్యూట్రోజెనా, ఎడ్జ్ వెల్ పర్సనల్ కేర్ కంపెనీకి చెందిన బనానా బోట్, బీర్స్ డ్రాఫ్ ఏజీకి చెందిన కాపర్ టోన్, ప్రోక్టర్ అండ్ గ్యాంబుల్ సీక్రేట్, ఓల్డ్ స్పైస్ ఉత్పత్తులను ఇలా మార్కెట్ నుంచి వెనక్కి తీసుకోవడం జరిగింది. వీటిల్లోనూ బెంజీన్ ఉందని గుర్తించడమే దీనికి కారణం. యూనిలీవర్ అనుబంధ సంస్థ హిందుస్థాన్ యూనిలీవర్ మన దేశంలోనూ డవ్, ట్రెసెమేలను విక్రయిస్తుండడం తెలిసిందే.
Unilever
dry shampoos
dove
Tresemme
recall
benzene
contaminated

More Telugu News