Indonesia: 54 ఏళ్ల మహిళను అమాంతం మింగేసిన కొండచిలువ!

  • ఇండోనేషియాలో ఘటన
  • రబ్బరు ఏరేందుకు అడవిలోకి వెళ్లి రెండు రోజులైనా తిరిగి రాని మహిళ
  • గాలింపు బృందాలకు కనిపించిన కొండచిలువ
  • దాని పొట్ట ఉబ్బెత్తుగా ఉండడంతో అనుమానం
  • పొట్ట చీల్చి కళేబరాన్ని బయటకు తీసిన వైనం
54 Year Old woman In Indonesia Reportedly Eaten Alive By 22 Foot Python

రబ్బరు ఏరేందుకు అడవిలోకి వెళ్లిన 54 ఏళ్ల మహిళను 22 అడుగుల భారీ కొండచిలువ అమాంతం మింగేసింది. ఇండోనేషియాలోని జాంబీ ప్రాంతంలో జరిగిందీ ఘటన. రబ్బరు ఏరేందుకు అడవిలోకి వెళ్లిన జరా ఆ తర్వాత అదృశ్యమైంది. రెండు రోజులైనా జాడ లేకపోవడంతో  అమె భర్త అడవిలో గాలించాడు. ఈ క్రమంలో ఓ చోట ఆమె చెప్పులు, జాకెట్, హెడ్‌స్కార్ఫ్, కత్తి కనిపించాయి. దీంతో ఆయన అధికారులకు సమాచారం అందించాడు. అదే రోజు సహాయక సిబ్బందితో కలిసి అదే ప్రదేశానికి చేరుకున్నాడు. ఆ ప్రాంతానికి కొంత దూరంలో ఓ భారీ కొండచిలువను గమనించారు. దాని కడుపు ఉబ్బెత్తుగా ఉండడంతో అనుమానించారు.

అదృశ్యమైన జరాను అది మింగేసి ఉంటుందని భావించి దానిని బంధించారు. ఆ తర్వాత గ్రామస్థులందరూ కలిసి దానిని చంపి పొట్టను చీల్చారు. పూర్తిగా జీర్ణం కాని స్థితిలో ఉన్న మహిళ కళేబరాన్ని బయటకు తీశారు. ఇందుకు సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జరాను మింగేందుకు కొండచిలువకు కనీసం రెండు గంటల సమయం పట్టి ఉంటుందని స్థానిక అధికారులు తెలిపారు. ఆమెను మింగడానికి ముందు చుట్టేసి ఊపిరాడకుండా చేసి చంపేసి ఉంటుందని అనుమానిస్తున్నారు. కాగా, ఇంతకుముందు ఈ ప్రాంతంలో 27 అడుగుల పొడవున్న కొండచిలువ కనిపించిందని స్థానికులు తెలిపారు.

More Telugu News