Bandi Sanjay: మరోసారి బండి సంజయ్ వాహనాన్ని ఆపి తనిఖీలు చేసిన పోలీసులు... వీడియో ఇదిగో!

Police checked Bandi Sanjay vehicle again
  • మునుగోడులో తనిఖీల పర్వం
  • నిన్న గంట వ్యవధిలో మూడుసార్లు బండి వాహనం తనిఖీ
  • నేడు లెంకలపల్లి చెక్ పోస్టు వద్ద తనిఖీ
  • తనిఖీ సమయంలో కారులోనే ఉన్న బండి సంజయ్
మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో, నియోజకవర్గంలో పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. నిన్న గంట వ్యవధిలోనే మూడుసార్లు బండి సంజయ్ వాహనాన్ని తనిఖీ చేసిన పోలీసులు, నేడు ఆయన వాహనాన్ని లెంకలపల్లి చెక్ పోస్టు వద్ద నిలువరించారు. 

వాహనంలో క్షుణ్నంగా తనిఖీలు చేపట్టారు. కారు డిక్కీలోని వస్తువులను నిశితంగా సోదా చేశారు. ఆ సమయంలో బండి సంజయ్ వాహనంలోనే ఉన్నారు. దీనికి సంబంధించిన వీడియోను బండి సంజయ్ తన సోషల్ మీడియా ఖాతా ద్వారా పంచుకున్నారు. తన వాహనాన్ని పోలీసుల మరోసారి చెక్ చేశారంటూ వెల్లడించారు. నిన్న బండి సంజయ్ వాహనాన్ని పుట్టపాక, చల్కెడ, తంగేడుపల్లి గ్రామాల్లో పోలీసులు తనిఖీ చేశారు.
Bandi Sanjay
Vehicle
Check
Police
Munugodu
BJP

More Telugu News