superfoods: పిల్లలు చదువులో షార్ప్ గా ఉండాలంటే ఈ ఫుడ్స్ ఇవ్వాల్సిందే

  • గుడ్లు ఎంతో అవసరం
  • ఉదయం బ్రేక్ ఫాస్ట్ కింద ఇవ్వాలి
  • చేపల ద్వారా ఒమెగా ఫ్యాటీ 3 యాసిడ్స్
  • వేరుశనగలు, పాలు, పండ్లకూ చోటివ్వాలి
Want your child to do better in class Try superfoods to fuel their brain development

పిల్లలకు జ్ఞాపకశక్తి ఎంతో ముఖ్యం. చదివిన, పరిశీలించిన ప్రతి విషయాన్ని మెమొరీలో స్టోర్ చేసుకున్నప్పుడే అది ఫలితమిస్తుంది. చాలా తక్కువ మంది పిల్లల మెదడు ఈ విషయంలో షార్ప్ గా ఉంటుంది. మరి మిగిలిన పిల్లల్లో ఎందుకు ఇది లోపిస్తుంది..? వారికి కావాల్సిన పోషకాలు అందకపోవడం కారణం కావచ్చు. మన శరీరానికి ఎన్నో రకాల పోషకాలు అవసరం. అప్పుడే వారిలో మెదడు ఎదుగుదల అన్నది చక్కగా ఉంటుంది. తగిన పోషకాలతో కూడిన ఆహారాన్ని ఇవ్వడం ద్వారా పిల్లల్లో జ్ఞాపకశక్తితోపాటు, తార్కిక శక్తిని కూడా పెంచొచ్చని నిపుణులు చెబుతున్నారు.

చేపలు 
సాల్మన్ చేపల్లో ఒమెగా ఫ్యాటీ 3 యాసిడ్స్ అయిన డీహెచ్ఏ, ఈపీఏ తగినంత ఉంటాయి. బ్రెయిన్ మంచిగా వృద్ధి చెందేందుకు, పని చేసేందుకు ఇవి అవసరం. 

గుడ్లు
ప్రోటీన్ లోపం పిల్లలకు ఉండకూడదు. కోడి గుడ్లలో ప్రోటీన్ సమృద్ధిగా ఉంటుంది. పచ్చసొనలో ఉండే కొలిన్ జ్ఞాపకశక్తిని పెంచుతుంది. పిల్లలు ఉదయం స్కూల్ కు వెళ్లే ముందు గుడ్లను బ్రేక్ ఫాస్ట్ గా ఇచ్చి పంపడం మంచి ఆప్షన్. ఉడికించిన గుడ్డు లేదంటే ఆమ్లెట్ రూపంలో ఇవ్వొచ్చు.

పీనట్ 
వేరు శనగలు, పీనట్ బటర్ లో  విటమిన్ ఈ అనే యాంటీ ఆక్సిడెంట్ లభిస్తుంది. ఇది న్యూరోనల్ మెంబ్రేన్లను కాపాడడంలో సాయపడుతుంది. దీనికితోడు పీనట్ లో థయమిన్ (బీ1) లభిస్తుంది. ఇది మెదడు, నెర్వస్ సిస్టమ్ గ్లూకోజును శక్తిగా మార్చుకోవడానికి సాయపడుతుంది.

ముడి ధాన్యాలు
ముడి ధాన్యాలు కూడా మెదడుకు కావాల్సిన శక్తినిచ్చే పదార్థాలే. పాలిష్డ్ ధాన్యాలతో పోలిస్తే ముడి ధాన్యాల్లో ఉండే ఫైబర్ శరీరం గ్లూకోజు సంగ్రహణను పెంచుతుంది. నాడీ వ్యవస్థ ఆరోగ్యంగా ఉండేందుకు ముడి ధాన్యాలు మంచి ఆప్షన్.

ఓట్స్, ఓట్స్ మీల్
పిల్లలకు మంచి చేసే ఆహారంలో ఓట్స్ కూడా ముఖ్యమైనవి. వీటిల్లో ఉండే ఫైబర్ పిల్లలకు రోజంతా కావాల్సిన శక్తిని క్రమంగా ఇచ్చేలా పనిచేస్తుంది. అలాగే, ఓట్స్ లో ఉండే పొటాషియం, జింక్, విటమిన్ ఈ, బీ విటమిన్స్, ఇతర పోషకాలు వారిని షార్ప్ గా ఉంచడంలో సాయపడతాయి.

బీన్స్
బీన్స్ లో విటమిన్లు, మినరల్స్, ప్రొటీన్లు ఉంటాయి.  ఫైబర్, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ లభిస్తాయి. మధ్యాహ్న భోజనంలో భాగంగా పిల్లలకు బీన్స్ తో చేసిన ఆహారాన్ని అందించాలి. ఇతర రకాలతో పోలిస్తే కిడ్నీ, పింటో బీన్స్ లో ఒమెగా ఫ్యాటీ 3 యాసిడ్స్ ఎక్కువగా లభిస్తాయి.

పాలు, పండ్లు, కూరగాయలు
టమాటాలు, స్వీట్ పొటాటో, గుమ్మడికాయ, క్యారట్స్, పాలకూర ఇవన్నీ పిల్లలకు కావాల్సిన ముఖ్యమైన పోషకాలను ఇస్తాయి. అలాగే, వారికి రోజువారీగా బెర్రీలు, స్ట్రాబెర్రీ, ఆరెంజ్, కత్తిరించిన బాదం గింజలు ఇవ్వాలి. మరీ ముఖ్యంగా బీ విటమిన్లు సమద్ధిగా లభించే పాలు, పాల ఉత్పత్తులైన పెరుగు, యుగర్ట్ తప్పకుండా తినిపించాలి.

More Telugu News