Health: మెరుగైన కంటిచూపు కోసం.. తీసుకోవాల్సిన ఆహార పదార్థాలివే..

Daily food items that can be helpful in improving eyesight
  • కంటి చూపును పెంచే ఆహార పదార్థాలు
  • తృణధాన్యాలతో కళ్లకు ఎంతో మేలు
  • గుడ్లు, చేపలను రోజూ తింటే కంటి సమస్యలు దూరం
ఆధునిక జీవనశైలి ప్రభావం కళ్లపైన చాలా ఎక్కువగా పడుతోంది. రోజులో ఎక్కువభాగం కంప్యూటర్ల ముందో, టీవీల ముందో గడపాల్సి వస్తోంది. ఆ తర్వాత అరచేతిలో స్మార్ట్ ఫోన్ ఉండనే ఉంది. వీటికి తోడు మిగతా కారణాల వల్ల కంటి చూపుతో పాటు ఇతర సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తోంది. అయితే, రోజువారీ మనం తీసుకునే ఆహారంలో కొన్ని పదార్థాలను చేర్చుకుంటే కంటి సంబంధిత సమస్యలకు చెక్ పెట్టొచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అవేంటంటే.. గుడ్లు, సిట్రస్ పండ్లు, క్యారెట్, తృణధాన్యాలు, చేపలు.

  • గుడ్లలో ఉండే విటమిన్ ఏ, లుటిన్ వంటి పోషకాలు కంటి చూపును మెరుగుపరుస్తాయని వైద్యులు సూచిస్తున్నారు. రోజూ గుడ్డు తినడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవడంతో పాటు కంటి చూపు సంబంధిత అనారోగ్యాలను దూరం పెట్టొచ్చని తెలిపారు.
  • సిట్రస్ పండ్లలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుందని, ఇది రెటీనాలోని కేళనాళికలకు మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. 
  • క్యారెట్ లోని విటమిన్ ఏతో పాటూ బీటా కెరోటిన్.. ఇన్ఫెక్షన్ల నుంచి కంటిని కాపాడుతుంది. తీవ్రమైన కంటి వ్యాధులను నివారించడంలో సాయపడుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.
  • బాదంతో పాటు ఇతర తృణధాన్యాలను రోజూ తీసుకోవడం ద్వారా కంటి ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. వీటిలోని ఒమేగా ఫ్యాటీ యాసిడ్లు కళ్లకు మేలుచేస్తాయని వైద్యులు సూచిస్తున్నారు.
  • చేపలలోని ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు కంటి చూపును కాపాడతాయని, వ్యాధులను దూరంగా ఉంచుతాయని నిపుణులు తెలిపారు. మాంసాహారం తినని వాళ్లు ఫిష్ ఆయిల్ సప్లిమెంట్లు తీసుకున్నా ఫలితం ఉంటుందని చెబుతున్నారు.
Health
eyes
healthy food
eyesight

More Telugu News