OnePlus: రూ.19 వేలకే వన్ ప్లస్ నార్డ్ ఎన్300

  • ఒకటే వేరియంట్ గా విడుదల
  • 228 డాలర్లుగా ధర నిర్ధారణ 
  • నవంబర్ 3 నుంచి విక్రయాలు
  • ఇతర మార్కెట్లకు తీసుకురావడంపై వెలువడని ప్రకటన
OnePlus launches Nord N300 5G Check key features price here

వన్ ప్లస్ సంస్థ యూఎస్ మార్కెట్ లో వన్ ప్లస్ నార్డ్ ఎన్300 5జీ మోడల్ ను విడుదల చేసింది. ఇది చూడ్డానికి ఎంతో ఆకర్షణీయంగా ఉంది. మిడ్ నైట్ జేడ్ అనే ఒకే రంగులో లభిస్తుంది. 4జీబీ ర్యామ్ తో కూడిన ఈ ఫోన్ ధర 228 డాలర్లు. అంటే మన రూపాయిల్లో రూ.19వేలు. నవంబర్ 3 నుంచి అక్కడ విక్రయాలు మొదలు కానున్నాయి. ఇతర మార్కెట్లలోకి ఈ మోడల్ ను ఎప్పుడు విడుదల చేసేదీ కంపెనీ ప్రకటించలేదు.

6.5 అంగుళాల ఐపీఎస్ ఎల్ సీడీ స్క్రీన్, మీడియాటెక్ డైమెన్సిటీ 810 5జీ చిప్ సెట్ ఉంటుంది. మీడియాటెక్ ప్రాసెసర్ తో అమెరికాలో విడుదలైన మొదటి ఫోన్ ఇదే. ఆండ్రాయిడ్ 13 ఓఎస్ పై ఆక్సిజన్ ఓఎస్ సాయంతో పనిచేస్తుంది. 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ తో పాటు 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ అడాప్టర్ కూడా రానుంది. 

నార్డ్ ఎన్ 300లో ముందు భాగాన సెల్ఫీల కోసం 8 మెగాపిక్సల్ కెమెరా ఏర్పాటు చేయగా, వెనుక భాగంలో 48 మెగా పిక్సల్ కెమెరా, 2 మెగాపిక్సల్ డెప్త్ లెన్స్ తో డ్యుయల్ కెమెరా సెటప్ ఉంటుంది. పవర్ బటన్ వద్దే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఏర్పాటు చేశారు.

More Telugu News