Vodafone: వొడాఫోన్ ఐడియాలో ఈ పోస్ట్ పెయిడ్ ప్లాన్లు ఉండవిక

Vodafone removes RedX postpaid plans from its list here is what will happen to existing users now
  • ఖరీదైన రెడ్ ఎక్స్ ప్లాన్లను తొలగించిన వొడాఫోన్ ఐడియా
  • పోర్టల్ లో కనిపించని వైనం
  • అధికారికంగా ఎటువంటి ప్రకటన విడుదల చేయని సంస్థ
వొడాఫోన్ ఐడియా ఎంతో పాపులర్ అయిన ప్రీమియం పోస్ట్ పెయిడ్ రెడ్ ఎక్స్ ప్లాన్లను తొలగించింది. సంస్థ ఫ్లాగ్ షిప్ ప్లాన్లుగా వీటికి పేరుంది. ఈ ప్లాన్లలో ఏదయినా ఎంపిక చేసుకుంటే కనీసం ఆరు నెలలు కొనసాగాలన్న నిబంధన ఉండేది. రెగ్యులర్ ప్లాన్లతో పోలిస్తే వీటి చార్జీలు కూడా చాలా ఎక్కువ. అయినా వీటికి డిమాండ్ ఉండేది. 

వీటి ధరలు రూ.1,000కు పైనే ఉండేవి. రూ.1,099, రూ.1,699, రూ.2,299 ఇలా మూడు ప్లాన్లను సంస్థ ఆఫర్ చేసింది. కానీ, ఇవేవీ ఇప్పుడు వొడాఫోన్ ఐడియా పోర్టల్ లో కనిపించడం లేదు. వీటిని నిలిపివేస్తున్నట్టు సంస్థ కూడా అధికారికంగా ప్రకటించలేదు. ఈ ప్లాన్లలో అపరిమితంగా రోజువారీ డేటాను వినియోగించుకోవచ్చు. అలాగే, ఏడాది పాటు అమెజాన్ ప్రైమ్, డిస్నీ హాట్ స్టార్ , వీఐ మూవీస్ ను ఉచితంగా పొందొచ్చు. 

ప్రస్తుతం రూ.399, రూ.499, రూ.699 పోస్ట్ పెయిడ్ ప్లాన్లు అందుబాటులో ఉన్నాయి. కుటుంబ సభ్యుల కోసం ఫ్యామిలీ ప్లాన్లు రూ.699, రూ.999, రూ.1,299 అందుబాటులోనే ఉన్నాయి.
Vodafone
RedX
postpaid plans
disappear

More Telugu News