చర్చిల్ వ్యాఖ్యలకు 75 ఏళ్ల తర్వాత సునాక్ సమాధానం: ఆనంద్ మహీంద్రా ఆసక్తికర ట్వీట్
- బ్రిటన్ ప్రధానిగా ఎన్నికై చరిత్ర సృష్టించిన రిషి సునాక్
- భారతీయులు తక్కువ స్థాయి కలిగి, వారి శక్తి సామర్థ్యాలు తక్కువగా ఉంటాయన్న విన్‌స్టన్ చర్చిల్
- ఆయన వ్యాఖ్యలు గుర్తు చేస్తూ జీవితం అందమైనదన్న ఆనంద్ మహీంద్రా
సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉండే ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా ఆసక్తికర ట్వీట్ చేశారు. బ్రిటన్ మాజీ ప్రధాని విన్‌స్టన్ చర్చిల్ గతంలో భారతీయులపై వ్యక్తం చేసిన అభిప్రాయాన్ని గుర్తు చేశారు. 1947లో భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన వేళ.. భారత్‌లోని నాయకులందరూ తక్కువ స్థాయి కలిగి ఉంటారని, వారిలో తక్కువ శక్తిసామర్థ్యాలు ఉంటాయని చర్చిల్ అన్న మాటలను గుర్తు చేసిన ఆనంద్ మహీంద్రా..75 ఏళ్ల తర్వాత భారత మూలాలున్న ఓ వ్యక్తి బ్రిటన్ పగ్గాలు చేపట్టడం ద్వారా చర్చిల్ మాటలకు జవాబు ఇచ్చారని, జీవితం అందమైనదని ట్వీట్ చేశారు.