Sitrang: ఏపీకి దూరంగా వెళ్లిపోయిన 'సిత్రంగ్' తుపాను

Cyclonic Storm Sitrang barrels towards Bangladesh and far away from AP coast
  • బంగాళాఖాతంలో 'సిత్రంగ్' తుపాను
  • దిశ మార్చుకున్న వైనం
  • బంగ్లాదేశ్ తీరం వైపు పయనం
  • రేపు తీరం దాటనున్న 'సిత్రంగ్'
బంగాళాఖాతంలో ఏర్పడిన 'సిత్రంగ్' తుపానుతో ఏపీకి ముప్పు లేనట్టే. నిన్న సాయంత్రం వరకు బంగాళాఖాతంలో కొనసాగిన తీవ్ర వాయుగుండం మరింత బలపడి తుపానుగా మారింది. 

ఇది దిశ మార్చుకోవడంతో ఏపీపై దీని ప్రభావం పూర్తిగా తొలగిపోయింది. పశ్చిమ మధ్య, తూర్పు మధ్య బంగాళాఖాతం నుంచి ఇది దిశ మార్చుకుని ఉత్తర ఈశాన్య దిశగా బంగ్లాదేశ్ కు వైపు పయనిస్తోంది. ప్రస్తుతం ఇది సాగర్ ఐలాండ్ కు దక్షిణంగా 380 కిలోమీటర్లు, బంగ్లాదేశ్ లోని బారిసాల్ కు దక్షిణ ఆగ్నేయ దిశగా 520 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. 

కాగా, 'సిత్రంగ్' తుపాను రానున్న 12 గంటల్లో మరింత బలపడి తీవ్ర తుపానుగా మారే అవకాశాలున్నాయని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) వెల్లడించింది. ఇది రేపు (అక్టోబరు 25) ఉదయం బంగ్లాదేశ్ లోని టింకోనా దీవి, సాంద్వీప్ మధ్య తీరం దాటనుందని ఐఎండీ తెలిపింది. దీని ప్రభావం ఒడిశాపై ఓ మోస్తరుగా, పశ్చిమ బెంగాల్ పై అధికంగా ఉండనుంది.
Sitrang
Cyclone
Andhra Pradesh
Bangladesh
Bay Of Bengal

More Telugu News