Balakrishna: యాడ్ ద్వారా వచ్చే ఆదాయాన్ని విరాళం ఇవ్వనున్న బాలకృష్ణ?

Balakrishna to donate ad remuneration to Basavatharakam cancer hospital
  • తొలిసారి వాణిజ్య ప్రకటనలో కనిపిస్తున్న బాలయ్య
  • రియలెస్టేట్ యాడ్ చేస్తున్న నటసింహం
  • రెమ్యునరేషన్ ను బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రికి ఇవ్వాలని నిర్ణయం
సినీ నటుడు బాలకృష్ణ ఫుల్ జోష్ లో ఉన్నారు. ఆయన నటించిన 'అఖండ' సినిమా ఘన విజయం సాధించింది. ఇప్పుడు మలినేని గోపీచంద్ దర్శకత్వంలో ఆయన 'వీరసింహారెడ్డి' అనే చిత్రాన్ని చేయబోతున్నారు. మరోవైపు ఆయన యాంకరింగ్ చేస్తున్న 'అన్ స్టాపబుల్' షో యావత్ దేశంలోనే అత్యధిక రేటింగ్స్ తో దూసుకుపోతోంది. మరోవైపు ఆయనకు సంబంధించిన మరో వార్త వైరల్ అవుతోంది. బాలయ్య తొలిసారి వాణిజ్య ప్రకటనలో నటిస్తున్నారు. 

ఒక రియలెస్టేట్ కంపెనీకి సంబంధించిన యాడ్ లో కనపించబోతున్నారు. ఇప్పటికే ఈ యాడ్ షూటింగ్ జరుగుతోందని సమాచారం. ఈ యాడ్ ద్వారా వచ్చే రెమ్యునరేషన్ ను ఆయన బసవతారం క్యాన్సర్ ఆసుపత్రికి విరాళం ఇవ్వాలని నిర్ణయించుకున్నారట. ఆయన గొప్ప మనసును అందరూ ప్రశంసిస్తున్నారు. మరోవైపు 'వీరసింహారెడ్డి' చిత్రంలో బాలయ్య సరసన శృతిహాసన్ నటిస్తోంది. ప్రముఖ కన్నడ నటుడు దునియా విజయ్ విలన్ గా నటిస్తున్నారు.
Balakrishna
Advertisement
Remuneration
Donation
Basavatharakam Cancer Hospital
Tollywood
Telugudesam

More Telugu News