Komatireddy Raj Gopal Reddy: సాధు జంతువులాంటి కాంగ్రెస్ ను చంపారు... అందుకే పులిలాంటి బీజేపీలో చేరాను: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

Komatireddy Rajagopal Reddy slams CM KCR

  • కేసీఆర్ కు అహంకారం ఎక్కువైందన్న రాజగోపాల్ రెడ్డి
  • విపక్షాలు లేకుండా చేయాలని చూస్తున్నారని ఆగ్రహం
  • తాగుబోతుల రాష్ట్రంగా మార్చారని విమర్శలు
  • లక్షల కోట్లు దోచుకున్నారని ఆరోపణ

మునుగోడు బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తెలంగాణ సీఎం కేసీఆర్ పై ధ్వజమెత్తారు. కేసీఆర్ కు అహంకారం ఎక్కువైందని అన్నారు. ఉద్యమకారుడని చెప్పుకునే కేసీఆర్ ప్రతిపక్షాలు లేకుండా చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. ప్రశ్నించే గొంతుకలు లేకుండా చేయాలన్న ఉద్దేశంతో ప్రతిపక్షాలను ఎలా కొంటారని ప్రశ్నించారు. 

సాధు జంతువులాంటి కాంగ్రెస్ ను చంపి 12 మంది ఎమ్మెల్యేలను కొన్నారని ఆరోపించారు. అందుకే తాను పులి లాంటి బీజేపీలో చేరానని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వెల్లడించారు. కేసీఆర్ తెలంగాణను తాగుబోతుల రాష్ట్రంగా మార్చారని విమర్శించారు. బంగారు తెలంగాణ పేరుతో లక్షల కోట్లు దోచుకున్నారని ఆరోపించారు.

More Telugu News