TDP: అమిత్ షాకు చంద్రబాబు బర్త్ డే విషెస్... కేంద్ర హోం మంత్రికి ఫోన్ చేసిన టీడీపీ అధినేత

tdp cheif chandrababu wished amit shah on his birth day
  • నేడు అమిత్ షా బర్త్ డే
  • దేశం నలుమూలల నుంచి వెల్లువెత్తిన విషెస్
  • సోషల్ మీడియా వేదికగా అమిత్ షాకు బర్త్ డే గ్రీటింగ్స్ చెప్పిన చంద్రబాబు
  • తర్వాత ఫోన్ చేసి విషెస్ తెలిపిన టీడీపీ అధినేత
బీజేపీ అగ్ర నేత, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా జన్మదినం సందర్భంగా శనివారం ఆయనకు దేశవ్యాప్తంగా ప్రముఖుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు కూడా అమిత్ షాకు బర్త్ డే విషెస్ చెప్పారు. ఈ మేరకు శనివారం మధ్యాహ్నం సోషల్ మీడియా వేదికగా అమిత్ షాకు చంద్రబాబు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అమిత్ షాకు ఆయురారోగ్యాలు సిద్ధించాలని చంద్రబాబు ఆకాంక్షించారు.

సోషల్ మీడియా వేదికగా అమిత్ షాకు బర్త్ డే విషెస్ చెప్పినప్పటికీ...ఆ తర్వాత కేంద్ర హోం మంత్రికి చంద్రబాబు స్వయంగా ఫోన్ చేశారు. ఈ సందర్భంగా అమిత్ షాకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు... అమిత్ షా నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. తనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబుకు అమిత్ షా ధన్యవాదాలు తెలియజేశారు.
TDP
Chandrababu
Amit Shah
BJP
Union Home Minister

More Telugu News