Andala Chandamamave: 'గీత సాక్షిగా' చిత్రం నుంచి 'అందాల చందమామవే' సాంగ్ ప్రోమో రిలీజ్

  • చేతన్ రాజ్ ఫిలింస్ బ్యానర్ పై గీత సాక్షిగా 
  • ఆదర్శ్, చిత్రా శుక్లా జంటగా చిత్రం
  • ఆంథోనీ మట్టిపల్లి దర్శకత్వం
Andala Chandamamave song promo released

చేతన్ రాజ్ ఫిలింస్ బ్యానర్ పై ఆదర్శ్, చిత్రా శుక్లా నటిస్తున్న చిత్రం 'గీత సాక్షిగా'. ఈ చిత్రానికి ఆంథోనీ మట్టిపల్లి దర్శకుడు. ఇందులో రాజా రవీంద్ర, రూపేష్ శెట్టి, శ్రీకాంత్ అయ్యంగార్, జయలలిత, అనిత చౌదరి, భరణి శంకర్ తదితరులు ఇతర పాత్రలు పోషించారు.

కాగా, ఈ చిత్రం నుంచి  'అందాల చందమామవే' అనే పాటకు సంబంధించిన ప్రోమో నేడు రిలీజ్ అయింది. ఈ పాట పూర్తి వీడియో దీపావళి సందర్భంగా ఈ నెల 24న ఉదయం 11.30 గంటలకు విడుదల చేయనున్నారు. 

ఈ గీతాన్ని ప్రముఖ యువ గాయకుడు సిద్ శ్రీరామ్ ఆలపించారు. ఈ మేరకు చిత్రబృందం ఓ ప్రకటనలో వెల్లడించింది. 'గీత సాక్షిగా' చిత్రానికి గోపీసుందర్ సంగీతం అందించగా, రెహమాన్ సాహిత్యం అందించారు.

More Telugu News