Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబుతో జై భీమ్ పార్టీ అధ్యక్షుడు జడ శ్రావణ్ కుమార్ భేటీ

Jai Bheem party president Jada Sravan Kumar met Chandrababu
  • టీడీపీ కేంద్ర కార్యాలయంలో భేటీ
  • ఇరువురి మధ్య పలు అంశాలపై చర్చ
  • ఇటీవల ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం చంద్రబాబు పిలుపు
జై భీమ్ పార్టీ అధ్యక్షుడు జడ శ్రావణ్ కుమార్ నేడు టీడీపీ అధినేత చంద్రబాబును కలిశారు. ఈ సాయంత్రం టీడీపీ కేంద్ర కార్యాలయానికి వచ్చిన శ్రావణ్ కుమార్... చంద్రబాబుతో భేటీ అయ్యారు. వీరిరువురు పలు అంశాలపై చర్చించారు. 

ఇటీవల జనసేనాని పవన్ కల్యాణ్ తో భేటీ సందర్భంగా చంద్రబాబు ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం అందరం కలిసి పనిచేద్దామంటూ రాజకీయ పక్షాలకు పిలుపునిచ్చారు. ఈ పిలుపునకు జై భీమ్ పార్టీ తరఫున శ్రావణ్ కుమార్ స్పందించినట్టు భావిస్తున్నారు. చంద్రబాబు, శ్రావణ్ కుమార్ ల సమావేశంలో రాష్ట్రంలో దళితులపై జరుగుతున్న దాడులు, తాజా రాజకీయ పరిస్థితులు చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది.
Chandrababu
Jada Sravan Kumar
TDP
Jai Bheem Party

More Telugu News