: మరింత అందంగా రానున్న సూపర్‌మేన్!
ప్రపంచంలో అందరు చిన్నారులకు చిరపరిచిత కార్టూన్ హీరో సూపర్‌మేన్ మరింత అందంగా ముస్తాబై రానున్నాడు. ఎందుకంటే సూపర్‌మేన్ ఈ ఏడాది 75వ వసంతంలోకి అడుగుబెడుతున్నాడు కాబట్టి. కొత్త పుట్టినరోజుకు సూపర్‌మేన్ కొత్తగా ముస్తాబై మన ముందుకు రానున్నాడు. డీసీ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ ఈ విషయాన్ని వెల్లడించింది.
ఇంతకుముందు సూపర్‌మేన్‌కు ఉన్న ఎరుపు, నీలం రంగులనూ, చేతుల్లేని పొట్టి చొక్కాను అలాగే ఉంచి, దాన్ని మరింత అందంగా ముస్తాబు చేసి మన ముందుకు తెస్తారట. అంతేకాదు జూన్ 12న విడుదలయ్యే కామిక్ పుస్తకాల్లో 1930 నుండి క్రమంగా మారుతూ వచ్చిన అన్ని పాత్రలూ ఉంటాయట. ఈ కొత్త పుట్టినరోజు సందర్భంగా డీసీ ఎంటర్‌టైన్‌మెంట్, వార్నర్ బ్రదర్స్ వారు పుట్టినరోజు సంబరాలను ఏడాది పొడవునా నిర్వహించాలని నిర్ణయించినట్టు ప్రతినిధులు చెబుతున్నారు.