మస్క్ చేతికి ట్విట్టర్ వెళితే.. ఉద్యోగుల పని ‘గోవిందా’
- 75 శాతం మంది ఉద్యోగులను తొలగించే ప్రణాళికలో మస్క్
- ఇదే నిజమైతే ట్విట్టర్ పై స్పామ్, హానికారక కంటెంట్ పెరిగిపోయే ప్రమాదం
- ప్రత్యేక కథనంలో పేర్కొన్న వాషింగ్టన్ పోస్ట్
75 శాతం మందిని తొలగించే ప్రణాళికతో మస్క్ ఉన్నారన్నది ఈ కథనంలోని ప్రధాన అంశం. కొన్ని డాక్యుమెంట్లతోపాటు, ట్విట్టర్ డీల్ పై చర్చల వ్యవహారం తెలిసిన వర్గాల ఆధారంగా వాషింగ్టన్ పోస్ట్ దీన్ని ప్రచురించింది. ఒకేసారి అంతమందిని తొలగిస్తే పెద్ద రిస్క్ వచ్చి పడుతుందని, హానికారక కంటెంట్, స్పామ్ ట్విట్టర్ ప్లాట్ ఫామ్ ను ఆక్రమిస్తాయని సందేహం వ్యక్తం చేసింది. తాను ట్విట్టర్ ను కొనుగోలు చేస్తే స్పామ్ బాట్ అకౌంట్లను తొలగిస్తానని మస్క్ సైతం ప్రకటించారు. మరోవైపు ఆర్థిక మందగమనం వల్ల నియామకాలను తగ్గించినట్టు ట్విట్టర్ జూన్ లోనే ఓ ప్రకటన చేసింది.