YSRCP: పవన్ కంటే ముందే... చంద్రబాబుకు 'ప్యాకేజీ బాబు' ముద్ర: మంత్రి నారాయణ స్వామి

ap deputy cm narayana swamy viral comments on pawan kalyan and chandrababu
  • ఏపీకి ప్రత్యేక హోదాను చంద్రబాబు వదిలేశారన్న నారాయణ స్వామి
  • తన ప్యాకేజీ కోసం రాష్ట్రాన్ని చంద్రబాబు అమ్మేవారని ఆరోపణ
  • నాడే చంద్రబాబుకు ప్యాకేజీ బాబు అని ముద్ర పడిందని వ్యాఖ్య
  • కాపుల గురించి మాట్లాడే హక్కు పవన్ కు లేదన్న డిప్యూటీ సీఎం
తనను ప్యాకేజీ స్టార్ అంటే చెప్పుతో కొడతానంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై వైసీపీ నేతల ఎదురు దాడి కొనసాగుతోంది. గురువారం పవన్ వ్యాఖ్యలపై ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి స్పందించారు. తనను విమర్శించే వైసీపీ నేతలను చెప్పుతో కొడతానని పవన్ వ్యాఖ్యానించడం సరికాదని ఆయన అన్నారు. ఈ సందర్భంగా పవన్ తో పాటు టీడీపీ అధినేత చంద్రబాబు పేరునూ ప్రస్తావించిన మంత్రి... చంద్రబాబునూ ప్యాకేజీ బాబుగా అభివర్ణించారు.

ఏపీకి ప్రత్యేక హోదాను వదిలేసి తన ప్యాకేజీ కోసం ఆంధ్ర రాష్ట్రాన్ని చంద్రబాబు అమ్మేశారని నారాయణ స్వామి ఆరోపించారు. ఈ కారణంగా నాడే చంద్రబాబుకు ప్యాకేజీ బాబు అనే ముద్ర పడిపోయిందని ఆయన అన్నారు. ఇప్పుడు పవన్ కల్యాణ్ కు కూడా అదే ముద్ర పడిందన్నారు. కాపుల గురించి మాట్లాడే హక్కు పవన్ కు లేదన్నారు. ముద్రగడ పద్మనాభంను చంద్రబాబు సర్కారు ఇబ్బంది పెడుతున్నప్పుడు పవన్ ఏమయ్యారని ఆయన ప్రశ్నించారు.
YSRCP
K Narayana Swamy
AP Deputy Cm
Janasena
Pawan Kalyan
TDP
Chandrababu

More Telugu News