Kodali Nani: నీ చెప్పుతో నువ్వే కొట్టుకో... అదే చెప్పుతో చంద్రబాబును కొట్టు: పవన్ పై కొడాలి నాని ఘాటు వ్యాఖ్యలు

kodali nani viral comments on pawan kalyan slipper comments
  • తనను ప్యాకేజీ స్టార్ అంటే చెప్పుతో కొడతానన్న పవన్ కల్యాణ్
  • పవన్ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసిన కొడాలి నాని
  • వచ్చే ఎన్నికల నాటికి ఆ చెప్పును జాగ్రత్తగా ఉంచుకోవాలని సూచన
  • చంద్రబాబుకు ఊడిగం చేయడానికే జనసేన ఉందని కామెంట్
తనను ప్యాకేజీ స్టార్ అంటే చెప్పుతో కొడతానంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై వైసీపీ నేతల ఎదురు దాడి కొనసాగుతోంది. గురువారం పవన్ వ్యాఖ్యలపై మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని స్పందించారు. పవన్ కల్యాణ్ కు ఆత్మాభిమానం కంటే కూడా ప్యాకేజీనే ముఖ్యమని నాని అన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబుకు ఊడిగం చేయడానికే జనసేన ఉందని నాని వ్యాఖ్యానించారు. 

ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ వ్యాఖ్యలను ప్రస్తావించిన నాని... ఘాటు వ్యాఖ్యలు సంధించారు. ''పవన్... నీ చెప్పును జాగ్రత్తగా ఉంచుకో. వచ్చే ఎన్నికల్లో కౌంటింగ్ రోజున అదే చెప్పుతో నిన్ను నీవు కొట్టుకో. నీ స్థితికి కారణమైన చంద్రబాబును అదే చెప్పుతో కొట్టు'' అని నాని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
Kodali Nani
YSRCP
Janasena
Pawan Kalyan
TDP
Chandrababu

More Telugu News