NIMS: నిమ్స్‌లో సరికొత్త విధానం.. ఆసుపత్రిలో చేరకుండానే కీమోథెరపీ

Hyderabad NIMS Started Chemotherapy Day Care Centre
  • కీమో థెరపీ డే కేర్ కేంద్రాన్ని ఏర్పాటు చేసిన నిమ్స్
  • నేటి నుంచే అందుబాటులోకి
  • ఆరోగ్యశ్రీ, జర్నలిస్టులు, ఉద్యోగులకు ఉచితంగా చికిత్స
కేన్సర్ రోగులకు హైదరాబాద్‌లోని ‘నిమ్స్’ శుభవార్త చెప్పింది. ఆసుపత్రిలో చేరకుండానే కీమోథెరపీ చేయించుకునే విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ మేరకు కీమో థెరపీ డే కేర్ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ఇందులో ఆరోగ్యశ్రీ కార్డుదారులతోపాటు ఆరోగ్యకార్డులున్న ఉద్యోగులు, జర్నలిస్టులకు ఉచితంగా చికిత్స పొందే సదుపాయం కల్పించారు. నేటి నుంచే ఇది అందుబాటులోకి రానుంది. 

నిజానికి కేన్సర్ రోగులకు కీమోథెరపీ చేయాలంటే కచ్చితంగా ఆసుపత్రిలో చేరాల్సిందే. ఆ తర్వాత నాలుగైదు రోజులపాటు ఆసుపత్రిలోనే ఉండాల్సి వచ్చేది. గ్రామాల నుంచి వచ్చే రోగులకు ఇది ఇబ్బందికరంగా ఉండేది. బోల్డంత సమయం వృథా అయ్యేది.

నిమ్స్‌లో తాజాగా అందుబాటులోకి వచ్చిన కీమోథెరపీ డే కేర్ కేంద్రం ద్వారా పేదలకు వేగంగా, ఉచితంగా కీమో థెరపీ సేవలు అందించేందుకు ఈ ఏర్పాట్లు చేసినట్టు ఆసుపత్రి మెడికల్ ఆంకాలజీ విభాగాధిపతి ప్రొఫెసర్ సదాశివుడు తెలిపారు. అంతర్జాతీయ ప్రమాణాలతో కొత్తగా 30 పడకలు ఏర్పాటు చేశామని, రోజుకు వందమందికి ఇక్కడ చికిత్స అందించేందుకు వీలవుతుందని ఆయన వివరించారు.
NIMS
Hyderabad
Cancer Patients
Chemotherapy

More Telugu News