Isro: ఒకేసారి 36 ఉపగ్రహాలను ప్రయోగించనున్న ఇస్రో

Isro ready to launch 36 OneWeb satellites on LVM3 to space
  • వన్ వెబ్ కు చెందిన బ్రాడ్ బ్యాండ్ శాటిలైట్ల ప్రయోగం
  • అంతరిక్షంలోని తక్కువ కక్ష్యలోకి తీసుకెళ్లనున్న ఎల్వీఎం3
  • ఇస్రోకి ఇది వాణిజ్య ప్రయోగం
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ఈ నెల 23న (22 అర్ధరాత్రి తర్వాత) ఓ ప్రయోగం చేపట్టనుంది. బ్రిటిష్ స్టార్టప్ ‘వన్ వెబ్’కు చెందిన 36 బ్రాడ్ బ్యాండ్ శాటిలైట్లను అంతరిక్షంలోకి ప్రయోగించనుంది. ఇందుకోసం లాంచ్ వెహికల్ మార్క్ 3 (ఎల్వీఎం3)ని ఉపయోగించనుంది. ఎల్వీఎం3ని గతంలో జియోసింక్రోనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్ మార్క్ 3 అని పిలిచేవారు. 

ఆంధ్రప్రదేశ్ లోని శ్రీహరికోట షార్ నుంచి ఈ ప్రయోగం జరగనుంది. ఇస్రోకి ఇది వాణిజ్య ప్రయోగం కానుంది. ఇస్రోకి చెందిన న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ (ఎన్ఎస్ఐఎల్) ద్వారా దీన్ని నిర్వహిస్తోంది. ఈ మేరకు వన్ వెబ్, ఎన్ఎస్ఐఎల్ మధ్య ఒప్పందం కుదిరింది. వన్ వెబ్ బ్రిటిష్ స్టార్టప్ అయినప్పటికీ ఇందులో మెజారిటీ వాటాలు ఎయిర్ టెల్ ప్రమోటర్ అయిన భారతీ ఎంటర్ ప్రైజెస్ కు ఉన్నాయి. 
Isro
launch
OneWeb satellites
LVM3
space

More Telugu News