Pawan Kalyan: చంద్రబాబుకు కృతజ్ఞతలు... ఎన్నికలకు ఎలా వెళ్లాలనేది ఒక్కరోజులో తేలే విషయం కాదు: పవన్ కల్యాణ్

Pawan Kalyan thanked Chandrababu
  • విజయవాడ నోవోటెల్ లో పవన్ తో చంద్రబాబు భేటీ
  • ఇరువురు నేతల సంయుక్త సమావేశం
  • పవన్ కు సంఘీభావం ప్రకటించిన చంద్రబాబు
  • ఇది ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన సమయమన్న పవన్
విజయవాడ నోవోటెల్ హోటల్ లో జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్, టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు మీడియా ముందుకు వచ్చారు. 

ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ, తనకు సంఘీభావం తెలిపేందుకు వచ్చిన చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని అన్నారు. అయితే ఎన్నికల గురించి మాట్లాడాల్సిన సమయం ఇది కాదని అన్నారు. ఎన్నికలకు ఎలా వెళ్లాలనేది ఒక్కరోజులో తేలే విషయం కాదని స్పష్టం చేశారు. ఇది ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడంపై ఆలోచించాల్సిన సమయం అని అభిప్రాయపడ్డారు. 

ప్రస్తుత పరిస్థితుల్లో రాజకీయ పక్షాలు, ప్రజలు, ప్రజా సంఘాలు ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన అవసరం ఉందని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. వైసీపీతో ఎలా పోరాడాలన్న దానిపై వ్యూహాలు మార్చుకోవాల్సి ఉందని, ఆ మేరకు వ్యూహాలు సిద్ధం చేస్తున్నామని చెప్పారు. 

తొలుత న్యాయ, రాజకీయ పోరాటం ఉంటుందని తెలిపారు. ఏదేమైనా ప్రజలకు మేలు చేయడమే తమ ఉద్దేశం అని స్పష్టం చేశారు.
Pawan Kalyan
Chandrababu
Janasena
TDP
Andhra Pradesh

More Telugu News