Pawan Kalyan: ఒక్క పెళ్లి చేసుకుని 30 మందితో తిరిగే మీకేందిరా నేను చెప్పేది?: పవన్ కల్యాణ్

Pawan Kalyan warining to YSRCP MLAs
  • తొలి భార్యకు 5 కోట్లు, రెండో భార్యకు ఆస్తి ఇచ్చానన్న పవన్
  • వైసీపీలో బాలినేని, ఆనంలాంటి మంచి వాళ్లు కూడా ఉన్నారని కితాబు
  • ఈరోజు నుంచి యుద్ధమే అని హెచ్చరిక
వైసీపీ నేతలపై సన్నాసులు, ఎదవలు అంటూ జనసేనాని పవన్ కల్యాణ్ నిప్పులు చెరిగారు. మంగళగిరిలో పార్టీ కార్యాలయంలో జనసైనికులతో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ... తాను లండన్ లోనో, న్యూయార్క్ లోనో పెరగలేదని... బాపట్లలో పుట్టానని.. గొడ్డుకారం తిన్నానని పవన్ అన్నారు. వీధి బడిలో చదువుకున్నానని చెప్పారు. 

మాట్లాడితే మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడని అంటున్నారని... మీరు కూడా మూడు పెళ్లిళ్లు చేసుకోండిరా ఎవడొద్దన్నాడు? అంటూ వైసీపీ నేతలపై ఆయన మండిపడ్డారు. తొలి భార్యకు రూ. 5 కోట్ల డబ్బిచ్చానని, రెండో భార్యకు మిగతా ఆస్తి ఇచ్చానని, ఆ తర్వాత మూడో పెళ్లి చేసుకున్నానని, విడాకులు తీసుకుని పెళ్లి చేసుకున్నానని చెప్పారు. ఒక్క పెళ్లి చేసుకొని 30 మంది స్టెపినీలతో తిరిగే మీకేందిరా నేను చెప్పేది? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. చొక్కా పట్టుకుని ఇళ్లలోంచి లాక్కొచ్చి కొడతా కొడ..రా అని హెచ్చరించారు. 

తాను కానిస్టేబుల్ కొడుకునని, ఐపీఎస్ ఆఫీసర్ కొడుకును కాదని... మాంచి ఇంగ్లీష్ తనకు రాదని, ముతక భాష వచ్చని... సంస్కారం ఉంది కాబట్టే ఇంత కాలం మూసుకుని ఉన్నానని పవన్ అన్నారు. మీకు మంచి పని చేయదని, శిక్షించడమే కరెక్ట్ అని చెప్పారు. వెధవలు అంటే వైసీపీలో ఉన్న అందరూ కాదని... బాలినేని శ్రీనివాస్, ఆనం రాంనారాయణరెడ్డి లాంటి మంచి వ్యక్తులు కూడా ఆ పార్టీలో ఉన్నారని అన్నారు. అలాంటి మంచి వ్యక్తులు కాకుండా బూతులు మాట్లాడే ప్రతి కొడు* చెపుతున్నా.. నుంచోబెట్టి తోలు ఒలుస్తా అందరికీ అని వార్నింగ్ ఇచ్చారు. 

నాకు రాజకీయం తెలియదనుకున్నారా? అని ప్రశ్నించిన ఆయన... మీరు క్రిమినల్ పాలిటిక్స్ చేస్తారని, తాను బలమైన సిద్ధాంతాలతో కూడిన రాజకీయాలు చేస్తానని చెప్పారు. యుద్ధానికి సిద్ధమని మీరు చెపితే... రాళ్లా, హాకీ స్టిక్సా దేనికైనా సిద్ధమని సవాల్ విసిరారు. ఎంతమంది వైసీపీ గూండా ఎమ్మెల్యే కొ**లు వస్తారో రండిరా ఛాలెంజ్ విసురుతున్నా అని అన్నారు. ఇప్పటి వరకు పవన్ మంచితనం, సహనం చూశారని... ఈరోజు నుంచి యుద్ధమేనని చెప్పారు.
Pawan Kalyan
janasena
ysrcp

More Telugu News