Sandipan Bhumre: మహారాష్ట్రలో మంత్రికి చికిత్స చేస్తుండగా పోయిన కరెంట్.. సెల్‌ఫోన్ కాంతిలో పూర్తి చేసిన వైద్యులు

 eknath shinde camp minister sandipan bhumre facing Problem in aurangabad govt dental hospital
  • ఆసుపత్రిని తనిఖీ చేసేందుకు వెళ్లి దంత పరీక్షలు చేయించుకున్న మంత్రి
  • రూట్ కెనాల్ ఆపరేషన్ చేస్తుండగా పోయిన కరెంట్
  • జనరేటర్ కోసం నిధులు మంజూరు చేయాలని అధికారులను ఆదేశించిన మంత్రి
మహారాష్ట్రలో ఓ మంత్రికి చికిత్స చేస్తుండగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో సెల్‌ఫోన్‌లోని టార్చ్‌ సాయంతో వైద్యులు చికిత్స పూర్తి చేశారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మహారాష్ట్ర కేబినెట్ మంత్రి సందీపన్ భుమ్రే నిన్న ఔరంగాబాద్‌లోని ఘటి డెంటల్ ఆసుపత్రిని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన దంత పరీక్ష చేయించుకున్నారు. పరీక్షించిన వైద్యులు రూట్ కెనాల్ చేయించుకోవాలని మంత్రికి సూచించారు. ఆయన సరేననడంతో చికిత్స ప్రారంభించారు. 

ఆ తర్వాత కాసేపటికే ఆసుపత్రిలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో మరో మార్గంలేక సెల్‌ఫోన్‌లోని టార్చ్‌ సాయంతో చికిత్స పూర్తి చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాకెక్కి వైరల్ అయ్యాయి. ఆసుపత్రికి జనరేటర్ సదుపాయం లేదని, గత కొంతకాలంగా అడుగుతున్నా ఫలితం లేకుండా పోయిందని వైద్యులు ఈ సందర్భంగా మంత్రికి విన్నవించారు. స్పందించిన ఆయన వెంటనే నిధులు మంజూరు చేయాలని అధికారులను ఆదేశించారు.
Sandipan Bhumre
Maharashtra
Operataion
Aurangabad

More Telugu News