ఏపీ ప్రభుత్వ సలహాదారుగా వైసీపీ మహిళా ఎమ్మెల్యే భర్త నియామకం
- విద్యాశాఖ సలహాదారుగా నియమితులైన సాంబశివారెడ్డి
- శింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి భర్తే సాంబశివారెడ్డి
- మురళి రాజీనామాతో ఖాళీ అయిన పోస్టులో నియామకం
ఏపీ విద్యా శాఖ సలహాదారుగా గడచిన మూడేళ్లుగా పనిచేస్తున్న రిటైర్డ్ ఐఏఎస్ అధికారి మురళి ఇటీవలే తన పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. తెలంగాణకు చెందిన మురళి... తన రాష్ట్రంలో విద్యా వ్యవస్థను చక్కదిద్దాల్సి ఉన్న కారణంగా పదవికి రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు. మురళి రాజీనామాతో ఖాళీ అయిన ఈ పోస్టులో జగన్ సర్కారు సాంబశివారెడ్డిని నియమించింది.