Sensex: భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

Markets ends in losses
  • 491 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
  • 126 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
  • 3.20 శాతం పెరిగిన ఎస్బీఐ షేర్ విలువ 

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారాన్ని భారీ లాభాల్లో ప్రారంభించాయి. ఈరోజు నష్టాల్లో ప్రారంభమైన మార్కెట్లకు కాసేపటికే కొనుగోళ్ల మద్దతు లభించింది. అమెరికా ఫ్యూచర్ మార్కెట్లు రాణించడంతో పాటు, ఐరోపా మార్కెట్లు సానుకూలంగా ప్రారంభం కావడం మన మార్కెట్లకు కలిసొచ్చింది. దీంతో, ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 491 పాయింట్లు లాభపడి 58,411కి పెరిగింది. నిఫ్టీ 126 పాయింట్లు పుంజుకుని 17,311 వద్ద స్థిరపడింది. 

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (3.20%), ఎన్టీపీసీ (1.88%), బజాజ్ ఫిన్ సర్వ్ (1.80%), ఐసీఐసీఐ బ్యాంక్ (1.78%), యాక్సిస్ బ్యాంక్ (1.75%). 

టాప్ లూజర్స్:
ఎల్ అండ్ టీ (-1.45%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (-0.77%), విప్రో (-0.60%), టాటా స్టీల్ (-0.55), నెస్లే ఇండియా (-0.28%).

  • Loading...

More Telugu News