Deepika Padukone: ప్రపంచంలోని టాప్-10 అందగత్తెల్లో భారత్ నుంచి దీపికా పదుకొణె

Deepika Padukone is only Indian among worlds 10 most beautiful women
  • 9వ స్థానంలో నిలిచిన బాలీవుడ్ నటి 
  • ఆమె అందానికి 91.22 శాతం స్కోరు  
  • మొదటి స్థానంలో జోడీ కామర్
  • ఆమెకు 98.7 శాతం స్కోరు 
ఈ ప్రపంచంలోనే అత్యంత అందమైన మహిళగా జోడీ కామర్ గుర్తింపు సంపాదించుకుంది. భారత్ నుంచి టాప్ -10 ప్రపంచ అందగత్తెల్లో దీపికా పదుకొణె ఒక్కరే చోటు సంపాదించారు. బియాన్స్, కిమ్ కదర్షియాన్ సైతం టాప్-10లోకి వచ్చేశారు.

బ్రిటన్ కు చెందిన ప్లాస్టిక్ సర్జన్ డాక్టర్ జూలియన్ డీ సిల్వ ఈ మేరకు అందమైన మహిళల వివరాలను ప్రకటించారు. పురాతన గ్రీక్ టెక్నిక్ లకు, అధునాత కంప్యూటరైజ్డ్ మ్యాపింగ్ స్ట్రాటజీని (గోల్డెన్ రేషియో ఆఫ్ బ్యూటీ) జోడించి డీ సిల్వ మహిళలకు స్థానాలు కేటాయిస్తుంటారు. 

దీపికా పదుకొణె 9వ ర్యాంకు సంపాదించుకుంది. జెండయా, బెల్లా హడిడ్, జోడీ కామర్ మొదటి స్థానం కోసం పోటీ పడ్డారు. జోడీ కామర్ మొదటి స్థానంలో నిలవగా, జెండయా, బెల్లా హడిడ్ రెండు, మూడో స్థానాల్లో ఉన్నారు. ముఖ కవళికలు, భౌతిక రూపం అన్నీ చూసిన తర్వాత ర్యాంకులను డీ సిల్వ కేటాయిస్తుంటారు. జోడీ కామర్ 98.7 స్కోరు సాధించింది. కచ్చితమైన ముఖాకృతికి కేవలం 1.3 శాతం దూరంలోనే ఆమె ఉండిపోయింది. 

జెండయా 94.37 శాతం, బెల్లా హడిడ్ 94.35 శాతం, బియాన్స్ 92.44 శాతం, అరియానా గ్రాండే 91.81 శాతం, టైలర్ స్విఫ్ట్ 91.64 శాతం, జోర్డాన్ డన్ 91.39 శాతం, కిమ్ కదర్షియాన్ 91.28 శాతం, దీపికా పదుకొణె 91.22 శాతం, హోయీన్ జంగ్ 89.63 శాతం స్కోరుతో టాప్-10లో ఉన్నారు.
Deepika Padukone
beautiful women
worlds top 10

More Telugu News