Manchu Vishnu: మోహన్ బాబుగారికి నేనెవరో తెలియదు .. నాతో ఆయనన్న మాట అదొక్కటే: 'జిన్నా' డైరెక్టర్

Ginna Movie Pre Release Event
  • మంచు విష్ణు తాజా చిత్రంగా రూపొందిన 'జిన్నా'
  • యాక్షన్ కామెడీ జోనర్లో నడిచే కథ 
  • సంగీత దర్శకుడిగా అనూప్ రూబెన్స్ 
  • సందడిగా సాగిన ప్రీ రిలీజ్ ఈవెంట్
ఈ నెల 21వ తేదీన దాదాపు నాలుగు సినిమాలు రంగంలోకి దిగుతున్నాయి. వాటిలో 'జిన్నా' సినిమా ఒకటి. మంచు విష్ణు హీరోగా రూపొందిన ఈ సినిమాకి సూర్య దర్శకత్వం వహించాడు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంటులో సూర్య మాట్లాడుతూ .. "నేను దర్శకత్వం వహించిన రెండో సినిమా ఇది. ఈ సినిమా నేను చేయడానికి ముఖ్య కారకులు కోన వెంకట్ గారు. నేను ఎవరన్నది మోహన్ బాబుగారికి తెలియదు .. ఆయన దగ్గరికి నన్ను కోన వెంకట్ గారు తీసుకుని వెళ్లారు. కోన వెంకట్ గారు నా గురించి చెప్పిన ఒకే ఒక్క మాటను నమ్మి మోహన్ బాబు గారు ఇంత పెద్ద సినిమాను నా చేతిలో పెట్టారు" అని అన్నాడు. 

" సూర్య నువ్వెవరో నాకు తెలియదు .. నీ గురించి తెలియదు .. కోన నీ గురించి చెప్పారు .. నిన్ను నమ్ముతున్నాను" అని మోహన్ బాబు గారు ఒకే ఒక మాట అన్నారు. ఈ సినిమా చేయడానికి నేను ఒప్పుకున్న తరువాత ఎప్పుడూ కూడా ఆయన నన్ను పిలిచి ఒక్క ప్రశ్న కూడా వేయలేదు. ఏది కావాలంటే అది అందజేస్తూ సినిమా పూర్తయ్యేవరకూ అండగా నిలిచారు. సీనియర్ టెక్నీషియన్స్ ను  నాకు ఇచ్చారు. ఆయన అలా చేయడం వల్లనే చోటా కె నాయుడుగారితో .. ప్రభుదేవాతో .. అనూప్ రూబెన్స్ తో కలిసి పనిచేయగలిగాను. ఆయన సహాయ సహకారాల వల్లనే ఈ సినిమా ఇంత గొప్పగా వచ్చింది" అని చెప్పాడు. 

ఈ సినిమాలో సన్నీలియోన్ తన పాత్రకి ప్రాణం పోసింది. పాయల్ కూడా గొప్పగా చేసింది. ఇక విష్ణు గారి విషయానికి వస్తే, ఆయన కమిట్ మెంట్ చూసి నేను ఆశ్చర్యపోయాను. తన టీమ్ ను ఆయన ఎంతో బాగా చూసుకుంటారు. యాక్షన్ .. కామెడీలో ఆయన టైమింగ్ నాకు బాగా నచ్చింది. ఒక రిస్కీ షాట్ తాను అనుకున్నట్టుగా రావడానికి ఆయన 13 టేకులు తీసుకోవడమే అందుకు నిదర్శనం" అంటూ చెప్పుకొచ్చాడు.
Manchu Vishnu
Payal
Sunny Leone
Ginna Movie

More Telugu News