Pawan Kalyan: నోవోటెల్ బయట పవన్ కోసం వేచి ఉన్న జనసైనికులు, అభిమానులు... పోలీసుల లాఠీచార్జి

Police lathi charge on Janasainiks
  • విశాఖ నోవోటెల్ హోటల్ లో పవన్ కల్యాణ్
  • పవన్ కోసం భారీగా తరలివచ్చిన కార్యకర్తలు, ఫ్యాన్స్
  • చెదరగొట్టిన పోలీసులు
జనసేనాని పవన్ కల్యాణ్ పోలీసుల ఆంక్షల నేపథ్యంలో విశాఖలోని నోవోటెల్ హోటల్ కే పరిమితం అయ్యారు. నేడు విశాఖలోని పోర్టు కళావాహిని స్టేడియంలో జనసేన పార్టీ జనవాణి కార్యక్రమం జరగాల్సి ఉంది. అయితే పోలీసుల ఆంక్షల నేపథ్యంలో జనవాణి రద్దయింది. దాంతో జనసైనికులు, పవన్ అభిమానులు ఈ సాయంత్రం నోవోటెల్ హోటల్ వద్దకు భారీగా తరలివచ్చారు. "అరటి పండు తొక్క జగన్ అన్న బొక్క" అంటూ నినాదాలు చేశారు.

ఈ నేపథ్యంలో, జనసైనికులను అక్కడ్నించి పంపించేందుకు పోలీసులు రంగప్రవేశం చేసి లాఠీలకు పనిచెప్పారు. వారిని అక్కడి నుంచి చెదరగొట్టారు. ఈ మేరకు ఓ వీడియోను జనసేన పార్టీ సోషల్ మీడియాలో పంచుకుంది.
Pawan Kalyan
Visakhapatnam
Janasena
Police

More Telugu News