Roja: 300 మంది దాడి చేశారంటూ రోజా సహాయకుడు దిలీప్ ఫిర్యాదు... జనసేన నేతలపై కేసు నమోదు

Roja assistant Dileep complains to Visakha airport police
  • విశాఖలో నిన్న ఉద్రిక్త పరిస్థితులు
  • ఎయిర్ పోర్టులో హైటెన్షన్
  • తన తలకు గాయమైందన్న రోజా సహాయకుడు దిలీప్
  • 300 మంది దాడికి దిగారని వెల్లడి
  • 28 మంది జనసేన నేతలపై కేసులు
విశాఖ విమానాశ్రయంలో నిన్న జరిగిన ఘటనలపై మంత్రి రోజా సహాయకుడు దిలీప్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మంత్రి రోజాపై కొందరు వ్యక్తులు దాడికి ప్రయత్నించారని ఆరోపించారు. ఈ దాడిలో తాను గాయపడ్డానని దిలీప్ వెల్లడించారు. ఓ లోహపు మూత తగిలి తన తలకు గాయమైందని తెలిపారు. ఈ దాడిలో 300 మంది జనసేన కార్యకర్తలు దాడికి దిగారని వివరించారు. ప్రభుత్వ వాహనాలను, ఆస్తులను ధ్వంసం చేశారని దిలీప్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. 

దిలీప్ ఫిర్యాదును స్వీకరించిన విశాఖ ఎయిర్ పోర్టు పోలీసులు జనసేన నేతలపై చర్యలకు ఉపక్రమించారు. 28 మంది జనసేన నేతలపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.
Roja
Attack
Assistant
Dileep
Police
Janasena
Airport
YSRCP

More Telugu News