ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాకు సీబీఐ సమన్లు
- ఢిల్లీ లిక్కర్ స్కాంపై సీబీఐ, ఈడీ కేసులు
- ఇప్పటికే పలువురిని విచారించిన సీబీఐ
- సోమవారం విచారణకు రావాలంటూ సిసోడియాకు తాజాగా సీబీఐ సమన్లు
ఇప్పటికే ఈ ఆరోపణలపై సీబీఐతో పాటు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కూడా కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో కీలకంగా వ్యవహరించారని భావిస్తున్న పలువురు వ్యక్తులను ఇప్పటికే దర్యాప్తు సంస్థలు విచారించాయి. ఇందులో భాగంగా తెలంగాణకు చెందిన అభిషేక్ రావును సీబీఐ అధికారులు ఏకంగా 5 రోజుల పాటు విచారించారు. ఈ విచారణ ముగిసిన మరునాడే సిసోడియాకు సీబీఐ అధికారులు సమన్లు జారీ చేయడం గమనార్హం.