Andhra Pradesh: ఏపీ మంత్రుల‌పై దాడి ఘ‌ట‌న‌పై హ‌త్యాయ‌త్నం కేసు న‌మోదు

vizag airport police registers attempt to murder case on attack on ap ministers
  • కేసు న‌మోదు చేసిన ఎయిర్‌పోర్టు పోలీసులు
  • ఎయిర్‌పోర్టులో సీసీటీవీ ఫుటేజీల‌ను ప‌రిశీలించిన విశాఖ పోలీస్ క‌మిష‌న‌ర్‌
  • సీసీటీవీ ఫుటేజీ ప‌రిశీల‌న‌తో నిందితుల గుర్తింపు
ఏపీలో అధికార పార్టీ వైసీపీ శ‌నివారం విశాఖ‌లో నిర్వ‌హించిన విశాఖ గ‌ర్జ‌నలో పాల్గొని తిరిగి వెళుతున్న మంత్రులు ఆర్కే రోజా, జోగి ర‌మేశ్‌ల‌తో పాటు టీటీడీ చైర్మ‌న్ వైవీ సుబ్బారెడ్డిలపై జ‌రిగిన దాడిపై పోలీసు కేసు న‌మోదు అయ్యింది. విశాఖ విమానాశ్ర‌యం ప‌రిధిలో జ‌రిగిన ఈ ఘ‌ట‌న‌పై ఎయిర్‌పోర్టు పోలీసులే కేసు న‌మోదు చేశారు. 

శ‌నివారం సాయంత్రం జ‌రిగిన ఈ ఘ‌ట‌న‌తో అప్ర‌మ‌త్త‌మైన విశాఖ పోలీసు క‌మిష‌న‌ర్ హుటాహుటీన ఎయిర్ పోర్టు చేరుకున్నారు. దాడికి సంబంధించి రికార్డు అయిన సీసీటీవీ ఫుటేజీని ఆయ‌న ప‌రిశీలించారు. ఈ ఫుటేజీలో నిందితుల‌ను గుర్తించిన పోలీసులు... నిందితుల‌పై హ‌త్యాయ‌త్నం కింద కేసులు న‌మోదు చేశారు.
Andhra Pradesh
YSRCP
Janasena
Vizag
AP Police

More Telugu News