Kohinoor: కోహినూర్ వజ్రం తిరిగి భారత్ కు ఎప్పుడొస్తుంది?

  • ఎలిజబెత్ 2 మరణం తర్వాత పెరిగిన డిమాండ్లు
  • 1849లో రాణి విక్టోరియాకు బహూకరించిన రాజా మహారాజా దిలీప్ 
  • 108 క్యారట్లతో కూడిన అతిపెద్ద వజ్రంగా గుర్తింపు
Govt response on when Kohinoor will be brought back to India

బ్రిటన్ రాణి ఎలిజబెత్ 2 ఇటీవలే కాలం చేయడంతో, ఇప్పటికైనా కోహినూర్ వజ్రాన్ని భారత్ కు తిరిగి తీసుకురావాలన్న డిమాండ్లు పెరిగిపోయాయి. దీనిపై విదేశాంగ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి స్పందించారు. ఈ అంశంపై సంతృప్తికరమైన పరిష్కారం కోసం మార్గాల అన్వేషణ కొనసాగుతుందని చెప్పారు. భూ ఉపరితలంపై అతిపెద్ద వజ్రంగా దీన్ని పరిగణిస్తుంటారు. 

‘‘కేంద్ర ప్రభుత్వం కొన్నేళ్ల క్రితమే పార్లమెంటులో దీనిపై స్పందన తెలియజేసింది. ఎప్పటికప్పుడు ఈ అంశాన్ని బ్రిటన్ ప్రభుత్వం దృష్టికి తీసుకెళుతున్నాం. సంతృప్తికరమైన పరిష్కారం లభించేంత వరకు మా ప్రయత్నాలు కొనసాగుతాయి’’ అని బాగ్చి పేర్కొన్నారు. కోహినూర్ వజ్రం 108 క్యారట్లతో ఉంటుంది. దీన్ని 1849లో రాణి విక్టోరియాకు రాజా మహారాజా దిలీప్ బహూకరించారు. దీన్ని స్వదేశానికి తిసుకురావాలన్న డిమాండ్లు పెరిగిపోయాయి.

More Telugu News